Manchu Vishnu
Manchu Vishnu : బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్(Rebel Star Prabhas) చేసిన సినిమాలలో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘ఆదిపురుష్'(Adipurush Movie). భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ అవ్వడమే కాకుండా, ఎన్నో కాంట్రవర్సిలకు తెర లేపింది. రామాయణం ని వక్రీకరించి చూపించారని, హిందూ సంప్రదాయాలను మంటగలిపే విధంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ తెరకెక్కించాడని, దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆందోళన చేసారు. కోర్టు లో ఈ చిత్రం పై కేసు ని కూడా నమోదు చేసారు. ప్రభాస్ కెరీర్ లో భవిష్యత్తులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రావొచ్చు, కానీ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని సరైన పద్దతిలో, మంచి డ్రామాని పండిస్తూ తీసి ఉండుంటే పదేళ్ల వరకు ఈ సినిమా రికార్డ్స్ చెక్కు చెదరకుండా ఉండేవి. అలాంటి అద్భుతాలను బాక్స్ ఆఫీస్ వద్ద నెలకొల్పేది.
Also Read : ప్రభాస్ చాలా వీక్ గా ఉంటాడు…నాతో పోల్చడం కష్టమే : మంచు విష్ణు…
డైరెక్టర్ తనకు లభించిన అద్భుతమైన అవకాశాన్ని చెడగొట్టేసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే మంచు విష్ణు(Manchu Vishnu) ‘కన్నప్ప'(Kannappa Movie) ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన కొన్ని ఒక ఇంటర్వ్యూ లో ఆదిపురుష్ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. యాంకర్ విష్ణు ని ఒక ప్రశ్న అడుగుతూ ‘కన్నప్ప మన దేశానికీ సంబంధించిన చిత్రం కథ కదా..మీరెందుకు న్యూజిల్యాండ్ లో ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం తెరకెక్కించారు?’ అని అడగగా, దానికి మంచు విష్ణు సమాధానం చెప్తూ ‘మహాభారతం ఎక్కడ జరిగింది అనేది ఎవరికైనా తెలుసా?, కానీ మహాభారతం ని వాళ్లకు అనువైన ప్రాంతాల్లో షూట్ చేసుకున్నారు, విడుదల చేసి హిట్స్ అందుకున్నారు. ఎక్కడ షూటింగ్ చేశాము అనేది ముఖ్యం కాదు, కథని ఎంత అద్భుతంగా తెరకెక్కించాము అనేదే ముఖ్యం. ఇక మా సినిమాని న్యూజిల్యాండ్ లో ఎందుకు తెరకెక్కించమంటే, ఇది మన నెలకు సంబంధించిన కథ. దట్టమైన అడవులు, పచ్చదనం ఉట్టిపడే ప్రాంతాలు అక్కడ చాలా ఉన్నాయి’.
‘మన దేశం లో కూడా ఒకప్పుడు అడవులు చాలా అందంగా ఉండేవి. ఈ విషయం ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు అడవులు అలా లేవు, ఒకప్పుడు అడవులు ఎలా ఉండేవో నేటి తరం ఆడియన్స్ కి చూపించాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాని అక్కడ తెరకెక్కించాం’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘ఆదిపురుష్’ చిత్రం కూడా వేరే దేశాల్లో చిత్రీకరించడం వల్లే ఫ్లాప్ అయ్యింది కదా అని యాంకర్ ప్రశ్నించగా ‘ఆదిపురుష్ తో మా సినిమాని పోల్చకండి. ఒకే చోట గ్రీన్ మ్యాట్ వేసి ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. అందులోనూ వాళ్ళు తీసింది రామాయణం కాదు, రామాయణం ఇలా ఉంటుంది అని ఊహించి ఆ చిత్రాన్ని తీశారు. అందుకే ఆ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఒక సినిమాకు కథ ఎంతో కీలకం అని , అది బాగుంటే మిగిలిన విషయాలను జనాలు పట్టించుకోరు అంటూ ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించాడు.
Also Read : ‘కన్నప్ప’ పై ట్రోల్స్ ఎవరు చేయిస్తున్నారో నాకు తెలుసు అంటూ మంచు విష్ణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు!