https://oktelugu.com/

SS Rajamouli : రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ పై కుట్రలు..ఏకంగా 700 కోట్ల ఖర్చు..తమిళ డైరెక్టర్ పై మండిపడుతున్న నెటిజెన్స్!

Kalki 2898 AD సినిమాలో కనిపించే పధి నిమిషాల మహాభారతం ఎపిసోడ్ కోసం జనాలుఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. అలాంటిది మహాభారతం పై ఒక సినిమానే తీస్తే ఇక ఎలాంటి సంచలనాలు నమోదు అవుతాయో ఊహించడానికి కూడా కష్టమే. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ని రాజమౌళి ఏకంగా ఆరు భాగాల్లో చూపించాలని అనుకున్నాడు.

Written By: , Updated On : February 23, 2025 / 09:23 AM IST
Rajamouli's dream project

Rajamouli's dream project

Follow us on

SS Rajamouli : అందరి స్టార్ డైరెక్టర్స్ కి ఉన్నట్టుగానే రాజమౌళి(SS Rajamouli) కి కూడా ఒక డ్రీం ప్రాజెక్ట్ ఉంది. అది మహాభారతం అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సబ్జెక్టు పై ఆడియన్స్ లో ఉన్న అమితాసక్తి మామూలుది కాదు. మహాభారతం కి సంబంధించి ఏ చిన్న అంశాన్ని అయినా ఆసక్తిగా వింటారు, చూస్తారు కూడా. ఉదాహరణకు ఆ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘కల్కి'(Kalki 2898 AD) చిత్రాన్ని ఆడియన్స్ ఏ రేంజ్ కి తీసుకెళ్లారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా క్వాలిటీ పరంగా బాగుంది కానీ, ఎమోషనల్ కనెక్ట్ లేదు అనే విమర్శలు ఎదురైనప్పటికీ, సినిమాలో కనిపించే పధి నిమిషాల మహాభారతం ఎపిసోడ్ కోసం జనాలుఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. అలాంటిది మహాభారతం పై ఒక సినిమానే తీస్తే ఇక ఎలాంటి సంచలనాలు నమోదు అవుతాయో ఊహించడానికి కూడా కష్టమే. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ని రాజమౌళి ఏకంగా ఆరు భాగాల్లో చూపించాలని అనుకున్నాడు.

బహుశా మహేష్(Superstar Mahesh Babu) సినిమా పూర్తి అయ్యాక ఆయన ప్రాజెక్ట్ నే చేయొచ్చు. తన విజన్ లో ఉన్న మహాభారతం ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ అవుతాయి అంటూ రాజమౌళి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు కూడా. అయితే ఆయనకంటే ముందుగా ఒక తమిళ స్టార్ డైరెక్టర్ 700 కోట్ల రూపాయిల బడ్జెట్ తో మహాభారతం తీసే ప్లాన్ లో ఉన్నట్టు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు లింగు స్వామి(Linguswamy). గతంలో ఈయన పందెం కోడి, ఆవారా లాంటి సినిమాలు తీసాడు. రీసెంట్ గానే రామ్ పోతినేని తో ‘ది వారియర్’ అనే చిత్రం కూడా చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే లింగు స్వామి తీసుకున్న నేపథ్యం వేరు అట.

ఆయన కేవలం మహాభారతం లోని అర్జునుడు, అభిమన్యుడు క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. అంటే విరాటపర్వం లో ఉన్నప్పుడు జరిగే స్టోరీ అన్నమాట. అప్పట్లో ఈ అంశంపై ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నర్తనశాల, మాయాబజార్ వంటి చిత్రాలు తెరకెక్కాయి. అయితే ఈ రెండు సినిమాల్లోనూ అభిమన్యుడు, ఉత్తర మధ్య జరిగే వివాహం వరకే చూపించారు. ఆ తర్వాత అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణం చెందే వరకు చూపించలేదు. లింగు స్వామి తీయబోయే సినిమా అభిమన్యుడు మరణం వరకు ఉండబోతుందట. అది చూపించే క్రమం లో కురుక్షేత్రం యుద్ధం మొత్తం రెండవ భాగం లో చూపిస్తే రాజామౌళి సినిమా పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజమౌళి కురుక్షేత్రం యుద్ధం మీదనే మూడు భాగాలు తీయబోతున్నాడు. ఆయన తీసే మహాభారతం సిరీస్ లో అభిమన్యుడి పై కూడా ప్రత్యేకమైన సినిమా ఉంటుంది. కాబట్టి కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం రాజమౌళి సినిమాపై పడే అవకాశం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.