Kamal Hasan: ప్రముఖ భారతీయ నటుడు, హీరో కమల్‌హాసన్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. విక్రమ్ సినిమా షూటింగ్ నిమిత్తం యూరప్ వెళ్లగా.. ఆయనకు కరోనా సోకింది. ప్రస్తుతం షూటింగ్ కూడా నిలిపేశారు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటూ క్వారంటైన్లో ఉంటున్నారు. ఈ విషయాన్న ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Kamal Hasan
దీంతో ఆయనకు ఎలా ఉందో అని రోజూ అప్డేట్కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా, కమల్ ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె శ్రుతిహాసన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన తండ్రి గురించి ఇంతగా ఆలోచిస్తున్న అభిమానులందరికీ ధన్యదావాలు తెలిపారు. ప్రస్తుతం కమల్ కోలుకుంటున్నారని.. త్వరలోనే అందరితో మాట్లాడేందుకు ప్రజల ముందుకు వస్తారని పోస్ట్ చేశారు.
Thankyou for all your wishes and prayers for my fathers health 🙏 He is recovering well and is looking forward to interacting with all of you soon !!
— shruti haasan (@shrutihaasan) November 24, 2021
Also Read: ఉదయ్ కిరణ్ రాసిన లేఖ బయటకు: ఆయన మరణానికి అదే కారణమా..?
కాగా, తమిళ్లో బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్.. ప్రస్తుతం కొవిడ్ బారిన పడటంతో.. ఆ స్థానంలో శ్రుతి హాసన్ రానున్నట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి. సింగర్, నటి, ర్యాపర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రుతి.. ఇప్పుడు హోస్ట్‌గా మారి తనలోని టాలెంట్‌ను ఎలా బయటపెట్టబోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ విషయంపై శ్రుతిహాసన్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు.
కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా విక్రమ్. ఇందులో కమల్ విక్రమ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో కమల్‌తో పాటు ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. కాగా, మరోవైపు, శ్రుతి హాసన్ బాలయ్య సినిమాలో నటిస్తోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ … విషమంగా ఆరోగ్యం