https://oktelugu.com/

Samantha: నీ పెంపుడు కుక్కకు ఉన్న ఇంపార్టెన్స్ కూడా చైతూకు లేదా సమంత!

Samantha: సమంత చేసిన ఓ పనికి నెటిజెన్స్ ఆమెను తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ తో ఎటాక్ చేస్తున్నారు. ఇంతకీ సమంత చేసిన ఆ పని ఏమిటో చూద్దాం. సమంత-నాగ చైతన్యల మధ్య ఇప్పుడు ఎటువంటి బంధం లేదు. ఒకప్పటి భార్య భర్తలు నేడు బద్ద శత్రువులు. వారిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నాగ చైతన్య కామ్ గా తన పని తాను చేసుకుపోతుండగా, సమంత మాత్రం పరోక్షంగా చైతూ పై మానసిక యుద్ధం […]

Written By:
  • Shiva
  • , Updated On : November 25, 2021 10:54 am
    Follow us on

    Samantha: సమంత చేసిన ఓ పనికి నెటిజెన్స్ ఆమెను తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ తో ఎటాక్ చేస్తున్నారు. ఇంతకీ సమంత చేసిన ఆ పని ఏమిటో చూద్దాం. సమంత-నాగ చైతన్యల మధ్య ఇప్పుడు ఎటువంటి బంధం లేదు. ఒకప్పటి భార్య భర్తలు నేడు బద్ద శత్రువులు. వారిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నాగ చైతన్య కామ్ గా తన పని తాను చేసుకుపోతుండగా, సమంత మాత్రం పరోక్షంగా చైతూ పై మానసిక యుద్ధం చేస్తుంది. తనని విమర్శిస్తున్న వారితో పాటు నాగ చైత్యనకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు.
    Samantha
    విడాకుల ప్రకటనలో.. మేము భార్యాభర్తలుగా విడిపోయినా, స్నేహాం కొనసాగుతుందని, ఎప్పటికీ మిత్రులమే అంటూ తెలియజేశారు. కానీ ఆ వాతావరణం కొంచెం కూడా కనిపించడం లేదు. ఒకరిపై ఒకరు చాలా కోపంగా ఉన్నారు. దీంతో వారి మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి అని, అందుకే విడాకులు తీసుకున్నారని అర్థం అవుతుంది. కాగా నాగ చైతన్య నవంబర్ 23న బర్త్ డే జరుపుకున్నారు. అభిమానులతో పాటు, పరిశ్రమ ప్రముఖులు నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.


    విడాకుల తర్వాత వచ్చిన చైతూ మొదటి బర్త్ డే కి సమంత ఎలా స్పందిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అక్కడ అనుకున్నట్లు ఏం జరగలేదు. సమంత చైతూ ని విష్ చేయలేదు. కాగా సమంత నిన్న తన పెట్ డాగ్ యాష్ బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఇంట్లో ఒక సభ్యుడి వలె యాష్ కోసం ఇల్లు అలంకరించి, కేక్ కట్ చేశారు. తన పెట్ డాగ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

    Also Read: వైరల్ అవుతున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఫోటో గ్యాలరీ.. మీరు చూశారా?

    ఇది నాగ చైతన్య ఫ్యాన్స్ కి మండేలా చేసింది. నాగ చైతన్యకు కనీసం బర్త్ డే విషెష్ చెప్పని, నీవు పెట్ డాగ్ బర్త్ డే సెలబ్రేట్ చేస్తావా అంటూ విరుచుకు పడుతున్నారు. విడాకులు తీసుకుంటే మాత్రం నాలుగేళ్లు కాపురం చేసిన నాగ చైతన్యకు ప్రాధాన్యత ఇవ్వవా? నీ పెట్ డాగ్ కి ఉన్న ఇంపార్టెన్స్ కూడా నాగ చైతన్యకు లేదా అంటూ సమంతపై విమర్శల దాడికి దిగారు. సమంత తాజా చర్య చైతూ ఫ్యాన్స్ కోపానికి కారణం కాగా, సమంతను తిట్టిపోస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై సమంత ఎలా స్పందిస్తారో చూడాలి.

    Also Read: Malayalam Beauties: నయా ట్రెండ్ సెట్ చేసిన మలయాళ ముద్దుగుమ్మలు!

    Tags