https://oktelugu.com/

Srinu Vaitla: పాత సినిమాల సమ్మేళనమే నిజమైతే ఇక శ్రీనువైట్లకు కష్టమే

Srinu Vaitla: నేడు శ్రీను వైట్ల అంటే పెద్దగా ఎవరికీ గౌరవం లేదు. ఆయనతో సినిమా చేయడానికి మీడియం రేంజ్ హీరో కూడా ఆసక్తి చూపించడం లేదు. కానీ, దర్శకుడిగా శ్రీను వైట్ల ఫామ్ కోల్పోక ముందు స్టార్ హీరోలు, పెద్ద పెద్ద నిర్మాతలు శ్రీను వైట్ల డేట్లు కోసం క్యూ కట్టారు. ఇప్పుడంటే.. ప్లాప్ ల్లో ఉన్నాడు కాబట్టి.. శ్రీను వైట్లను దూరం పెట్టారు గానీ, ఆరేళ్ళ క్రితం వరకు శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్స్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 22, 2021 / 04:48 PM IST
    Follow us on

    Srinu Vaitla: నేడు శ్రీను వైట్ల అంటే పెద్దగా ఎవరికీ గౌరవం లేదు. ఆయనతో సినిమా చేయడానికి మీడియం రేంజ్ హీరో కూడా ఆసక్తి చూపించడం లేదు. కానీ, దర్శకుడిగా శ్రీను వైట్ల ఫామ్ కోల్పోక ముందు స్టార్ హీరోలు, పెద్ద పెద్ద నిర్మాతలు శ్రీను వైట్ల డేట్లు కోసం క్యూ కట్టారు. ఇప్పుడంటే.. ప్లాప్ ల్లో ఉన్నాడు కాబట్టి.. శ్రీను వైట్లను దూరం పెట్టారు గానీ, ఆరేళ్ళ క్రితం వరకు శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ డైరెక్టర్.

    Srinu Vaitla

    ఓ దశలో టాప్ నలుగురు డైరెక్టర్ లిస్ట్ లో కూడా శ్రీను వైట్ల పేరు ఉంది. దానికి తగ్గట్టుగానే కమర్షియల్ అంశాలకు మంచి హాస్యాన్ని మేళవించి ప్రేక్షకుల్ని నవ్వించి.. వరుస విజయాలను అందుకోవడంలో శ్రీను వైట్లకి మంచి దిట్ట అని పేరు వచ్చింది. కానీ ప్రస్తుతం ఏ ఏవరేజ్ హీరో కూడా శ్రీను వైట్లకు డేట్స్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కచ్చితంగా ఇది శ్రీనువైట్ల బ్యాడ్ టైమే.

    నేటి కామెడీ చిత్రాల దర్శక దిగ్గజంగా శ్రీనువైట్లకు ఉన్న పేరుకే ఇది అవమానకరం. దానిలో ఎలాంటి అనుమానం లేదు. ప్రస్తుతం మంచు విష్ణుతో శ్రీనువైట్ల “డిడి (డబుల్ డోస్)” అనే మూవీ చేస్తున్నాడు. మొన్నటివరకూ ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వస్తోందని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. అయితే, తాజాగా ఒకరు ఇద్దరు బయ్యర్లు ఈ సినిమాని రఫ్ వెర్షన్ ను చూశారు.

    సినిమాలో ఎలాంటి మ్యాటర్ లేదని తేల్చేశారు. శ్రీనువైట్ల పాత సినిమాల సమ్మేళనంలా ఈ సినిమా ఉందని ఆ బయ్యర్ల అభిప్రాయం. మరి ఈ సినిమా నిజంగానే ప్లాప్ అయితే, ఇక శ్రీనువైట్ల పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోలు పిలిచి మరీ శ్రీనువైట్లకు ఛాన్స్ లు ఇచ్చేవారు, ఈ సినిమా ప్లాప్ అయితే, చిన్న హీరోలు కూడా శ్రీనువైట్లకు ఛాన్స్ ఇవ్వరు.

    Also Read: Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్ అద్భుతం.. స్టార్ హీరో కోసం మరో కథ సిద్ధం !

    ఏది ఏమైనా ఈ సినిమా పూర్తి కాకముందే.. మరో సినిమాని మొదలుపెట్టాలనేదే శ్రీనువైట్ల ప్లాన్. ఈ క్రమంలో హీరో రామ్ తో శ్రీనువైట్ల ఒక సినిమా ప్లాన్ చేశాడు. రామ్ కూడా ఎప్పటి నుంచో శ్రీనువైట్లతో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

    Also Read: Hey Sinamika Movie: దుల్కర్ సల్మాన్ ” హేయ్ సినామిక” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్…

    Tags