Hey Sinamika Movie: చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు బృందా మాస్టర్. కేవలం కొరియోగ్రాఫర్ గానే కాకుండా తెలుగులో పలు డాన్స్ షో లకు జడ్జిగా కూడా వ్యవహరించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బృందా. ఇప్పుడు తాజాగా ఈమె మెగాఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. మొదటి అవకాశం లోనే ఏకంగా మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్‌ను డైరెక్షన్ చేసే అవకాశం దక్కించుకుంది బృందా మాస్టర్. ‘హే సినామిక’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

Also Read: హ్యాట్రిక్ కాంబినేషన్ తో వస్తున్న గోపిచంద్ – డైరెక్టర్ శ్రీవాస్…
కాగా ఇటీవల ఈ సినిమాలోని దుల్కర్ ఫస్ట్‌లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలానే సినిమా విడుదల తేదీని కూడా చిత్ర బృందం ప్రకటించింది. కాగా తెలుగులో అక్కినేని నాగార్జున, తమిళంలో సూర్య, మలయాళంలో నజ్రియా-ఫాహద్ వంటి స్టార్ నటులు దుల్కర్ ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎంతో కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ పోస్టర్‌లో దుల్కర్ కూడా వివిధ రకాల గెటప్పుల్లో కనిపించి ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో దుల్కర్ రేడీయో జాకీగా కనిపించనున్నాడని తెలుస్తుంది. జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2022 ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. కాగా బృందాతో పాటు పలువురు మహిళా ప్రముఖులు ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. ప్రీతి జయరామన్ సినిమాటోగ్రాఫర్‌గా, రాధా శ్రీధర్ ఎడిటర్‌గా ఈ సినిమాలో చేస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.
Presenting the super colourful FIRST LOOK👍The dashing Dulquer Salmaan as Yaazhan in #HeySinamika
All the best @BrindhaGopal1 ❤️
On big screen Feb 25, 2022 #DQ33FirstLook #DQ33@dulQuer @MsKajalAggarwal @aditiraohydari @jiostudios @SonyMusicSouth @NetflixIndia @Viacom18Studios pic.twitter.com/euMR0p2bWN— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 21, 2021
Also Read: పాత సినిమాల సమ్మేళనమే నిజమైతే ఇక శ్రీనువైట్ల కష్టమే