Actor Gopi Chand: హ్యాట్రిక్ కాంబినేషన్ తో వస్తున్న గోపిచంద్ – డైరెక్టర్ శ్రీవాస్…

Actor Gopi Chand: ప్రముఖ హీరో గోపీచంద్ ఇప్పుడు తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ లో సినిమా మొదలు పెడుతున్నాడు. గోపీచంద్ కెరియర్ లో లక్ష్యం సినిమాకి ఒక ప్రత్యే స్థానం ఉందని చెప్పాలి. అనుష్క, జగపతి బాబు, కోటా శ్రీనివాస్ రావు లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకి భారీ సక్సెస్ ను అందుకుంది. ఆ సినిమాతోనే శ్రీవాస్ దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో లౌక్యం అనే […]

Written By: Raghava Rao Gara, Updated On : December 22, 2021 5:11 pm
Follow us on

Actor Gopi Chand: ప్రముఖ హీరో గోపీచంద్ ఇప్పుడు తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ లో సినిమా మొదలు పెడుతున్నాడు. గోపీచంద్ కెరియర్ లో లక్ష్యం సినిమాకి ఒక ప్రత్యే స్థానం ఉందని చెప్పాలి. అనుష్క, జగపతి బాబు, కోటా శ్రీనివాస్ రావు లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకి భారీ సక్సెస్ ను అందుకుంది. ఆ సినిమాతోనే శ్రీవాస్ దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో లౌక్యం అనే మరో సినిమా కూడా రాగా… ఈ సినిమా కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. కాగా ఇప్పుడు ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా మొదలవుతుంది. గోపీచంద్‌ కెరీర్‌లో ఇది 30వ సినిమా కాగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Actor Gopi Chand

Also Read: పాత సినిమాల సమ్మేళనమే నిజమైతే ఇక శ్రీనువైట్ల కష్టమే

భూపతి రాజా చెప్పిన కథ నచ్చడంతో గోపీచంద్‌ వెంటనే ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. దర్శకుడు శ్రీవాస్‌తో మరోసారి అసోసియేట్‌ అవుతుండడంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను డిసెంబర్ 24న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో హౌరా బ్రిడ్జితో పాటు ప్రజలు గూమికూడి ట్రాఫిక్‌తో ఉన్న కోల్‌కత్తాలో ఫేమస్‌ కాళీమాత విగ్రహం కనిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో మరింత ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా టైటిల్‌ ఖరారు కావాల్సి ఉంది. మరి ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతారా లేదా అన్నది చూడాల్సి ఉండగా ప్రస్తుతం గోపీచంద్ మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌‘పక్కా కమర్షియల్‌’ సినిమా తో బిజీగా ఉన్నాడు.

Also Read: దుల్కర్ సల్మాన్ ” హేయ్ సినామిక” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్…