Homeఎంటర్టైన్మెంట్Shanti Apology Ram Charan: రామ్ చరణ్ కి క్షమాపణలు చెప్పిన ప్రముఖ నటుడు శ్రీహరి...

Shanti Apology Ram Charan: రామ్ చరణ్ కి క్షమాపణలు చెప్పిన ప్రముఖ నటుడు శ్రీహరి సతీమణి శాంతి.. అసలు ఏమైందంటే..

Shanti Apology Ram Charan: విలన్ గా , హీరో గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న రియల్ స్టార్ శ్రీహరి వంటి దిగ్గజ నటుడు చనిపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తీరని లోటు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరో రోల్స్ నుండి క్యారెక్టర్ రోల్స్ కి ఆయన షిఫ్ట్ అయ్యినప్పుడు చేసిన సినిమాలను అంత తేలికగా ప్రేక్షకులు అసలు మర్చిపోలేరు. అలాంటి సినిమాల్లో ఒకటి ‘మగధీర’. ఇందులో షేర్ ఖాన్ అనే పాత్రలో శ్రీహరి ఎంత అద్భుతంగా నటించాడో మన అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు ఈ పాత్రని జనాలు మర్చిపోలేరు. ఈ క్యారక్టర్ ని శ్రీహరి తప్ప ఇంకెవ్వరు చెయ్యలేరు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమాని ఆయన ఒప్పుకునే ముందు జరిగిన కొన్ని సంఘటనలు శ్రీహరి సతీమణి శాంతి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ ‘మగధీర గురించి మీకు ఎవ్వరికీ తెలియని ఒక విషయం చెప్పాలి. ఈ సినిమా స్టోరీ ని చెప్పడం కోసం రాజమౌళి ఒక రోజు మా ఇంటికి వచ్చాడు. ఇలా మగధీర సినిమా చేస్తున్నాను , ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ అందులో ఒకటి ఉంది , అది మీరే చెయ్యాలి అని శ్రీహరి గారిని అడిగారు. అయితే అప్పటికే శ్రీహరి గారు హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకొని పెద్ద స్థాయిలో ఉన్నాడు. నాకు మళ్లీ ఆయన క్యారెక్టర్ రోల్స్ చేయడం ఇష్టం లేదు , అందుకే నేను ఈ సినిమాని చేయొద్దు అని చెప్పాను. ఆ తర్వాత ఆయన నాకు స్టోరీ ని కూడా వివరించి తన పాత్ర ఎలాంటిదో చెప్పాడు. అప్పటికీ నేను ఒప్పుకోలేకపోయాను. రాజమౌళి గారి దర్శకత్వం లో హీరో గా అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ పక్కన పెట్టి మరీ చేయమని చెప్పేదాన్ని’.

‘కానీ క్యారెక్టర్ రోల్ అంటే నాకు ఎందుకో నచ్చడం లేదు. అయితే శ్రీహరి గారు నా మాట వినకుండా ఆ చిత్రాన్ని చేశాడు. సినిమా విడుదల తేడా రాజమౌళి గారు షేర్ ఖాన్ గా శ్రీహరి ని చూపించిన విధానం ని చూసి షాక్ అయ్యాను. ఈ సినిమాకు శ్రీహరి లేకుండా అసలు సినిమానే లేదు అనిపించింది . రాజమౌళి గారు అన్యాయం చెయ్యలేదు అని చాలా సంతోషించాను ‘ అంటూ చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే శ్రీహరి 2005 వ సంవత్సరం నుండే క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు , ఎన్నో అద్భుతమైన పాత్రలు ఆయనకు దక్కాయి, కానీ ఎందుకు ‘మగధీర’ లో చేసేందుకు శాంతి ఇష్టపడలేదు అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular