భువి నుంచి దివికి.. నేడు అతిలోక సుందరి వర్ధంతి

భార‌తీయ సినీ వినీలాకాశంలో ఆమెది ఎన్నటికీ చెరిగిపోని అందం.. వెండితెర‌పై ఎప్ప‌టికీ వ‌న్నె త‌ర‌గ‌ని అభిన‌యం.. త‌న అంద‌చందాల‌తో యువ‌త‌ను ఉర్రూత‌లూగించింది.. త‌న అభిన‌య కౌశ‌లంతో ఆబాల గోపాలాన్నీ అల‌రించింది.. అందుకే.. ఆమె దివి నుంచి భువికి దిగివ‌చ్చిన అతిలోక సుంద‌రి అంటే.. అవును అంటూ అంగీక‌రించింది ప్రేక్ష‌క లోకం. ఇండియ‌న్ సెల్యూలాయిడ్ పై స్పెష‌ల్ సింహాస‌నంపై అధిష్టింప‌చేసింది. ఆ విధంగా.. దాదాపు మూడు ద‌శాబ్దాలపాటు భారత సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన అతిలోక సుంద‌రి.. […]

Written By: Bhaskar, Updated On : February 24, 2021 10:45 am
Follow us on


భార‌తీయ సినీ వినీలాకాశంలో ఆమెది ఎన్నటికీ చెరిగిపోని అందం.. వెండితెర‌పై ఎప్ప‌టికీ వ‌న్నె త‌ర‌గ‌ని అభిన‌యం.. త‌న అంద‌చందాల‌తో యువ‌త‌ను ఉర్రూత‌లూగించింది.. త‌న అభిన‌య కౌశ‌లంతో ఆబాల గోపాలాన్నీ అల‌రించింది.. అందుకే.. ఆమె దివి నుంచి భువికి దిగివ‌చ్చిన అతిలోక సుంద‌రి అంటే.. అవును అంటూ అంగీక‌రించింది ప్రేక్ష‌క లోకం. ఇండియ‌న్ సెల్యూలాయిడ్ పై స్పెష‌ల్ సింహాస‌నంపై అధిష్టింప‌చేసింది. ఆ విధంగా.. దాదాపు మూడు ద‌శాబ్దాలపాటు భారత సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన అతిలోక సుంద‌రి.. అర్ధంతరంగా త‌న జీవిత‌ పాత్ర‌ను ముగించుకొని భువి నుంచి దివికేగింది! ఆమే.. అందాల న‌టి శ్రీదేవి. నేడు ఆమె మూడ‌వ వర్ధంతి. ఈ సంద‌ర్భంగా ఆమె సినీ జీవితాన్ని ఓ సారి ప‌రిశీలిస్తే.. ఎన్నో మ‌ధురానుభూతులు, మ‌రెన్నో మైలురాళ్లు ద‌ర్శ‌న‌మిస్తాయి.

Also Read: బాలయ్య బాబు ఇలా షాకిచ్చాడు!

త‌మిళ‌నాట జ‌న‌నం..
16ఏళ్ల ప్రాయంలో త‌న అందంతో చూపు తిప్పునివ్వ‌కుండా చేసి శ్రీదేవి.. ఐదు ప‌దుల వ‌య‌సులోనూ అదే సౌంద‌ర్యాన్ని కొన‌సాగించారు. జీవితాంతం వన్నెతరగని అందంతో వెలిగిపోయిన శ్రీదేవి.. త‌మిళ‌నాడులో జ‌న్మించారు. 1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో పుట్టారు. పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌ళిస్తుంద‌న్న నానుడిని నిజం చేస్తూ త‌న‌దైన న‌ట‌న‌తో చిన్న‌త‌నంలోనే సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు.

బాల న‌టిగా..
శ్రీదేవికి నాలుగేళ్ల వయసులో నే సినిమా ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయ్యారు. ‘కందన్ కరుణయ్’ అనే తమిళ సినిమాలో బాలనటిగా ఆమెకు అవకాశం వచ్చింది. ఈ సినిమాలో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత..‌ పదేళ్ల వయసుకే సినిమాల్లో బిజీ అయిపోయింది శ్రీదేవి. ఆ విధంగా ఆమె వ‌య‌సుతోపాటు సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల‌నూ పెంచుకుంటూ వ‌చ్చింది. టీనేజ్ కు వ‌చ్చే నాటికి బీజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రీదేవి.

హీరోయిన్ గా…
త‌మిళ‌నాట హీరోయిన్ గా 1976లో మొద‌టి సినిమా చేసింది శ్రీదేవి. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘ముంద్రముదచ్చు’ మూవీలో రజనీకాంత్, కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా శ్రీదేవికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత వెను తిరిగి చూసుకోలేదు. వరుస ఆఫర్లు వచ్చాయి. తమిళనాట కమల్ హాసన్ – శ్రీదేవి జోడి హిట్ పెయిర్ గా నిలిచింది. ఆ విధంగా కమల్ తోనే ఎక్కువ సినిమాలు చేసింది శ్రీదేవి. వీరి కాంబోలో.. శంకర్ లాల్, సిగప్పు రోజక్కల్, ఆకలి రాజ్యం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. 1975-85 దశాబ్దంలో తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా శ్రీదేవి ఓ వెలుగు వెలిగింది.

Also Read: అరియానా రేటు రోజుకు లక్ష.. 25వేలకే వచ్చింది..

టాలీవుడ్ లోకి ఎంట్రీ..
తెలుగు సినీ పరిశ్రమలోకి 1977లో ‘బంగారక్క’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి. ఆ తర్వాత వచ్చిన ‘పదహారేళ్ల వయసు’ సినిమా శ్రీదేవిని టాప్ స్టార్ గా నిలబెట్టింది. ‘సిరిమల్లెపూవా..’ అంటూ శ్రీదేవి పాడిన పాటకు యూత్ ఫిదా అయిపోయింది. ఆ విధంగా యువత కలల రాణిగా మారిపోయింది. టాప్ హీరోతో సమానంగా శ్రీదేవిని కొలిచారు ఫ్యాన్స్. ఆ విధంగా టాలీవుడ్లోనూ నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తాచాటింది. ఇక్కడ కూడా హీరోలుగా ఉన్నవారందరి సరసన నటించింది.

ఎన్నో హిట్లు..
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ‌, చిరంజీవి వంటి స్టార్ హీరోల‌తో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించింది శ్రీదేవి. ఎన్టీఆర్ తో వేటగాడు, బొబ్బిలిపులి, కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు, ఏఎన్ ఆర్ తో ప్రేమాభిషేకం, ముద్దుల కొడుకు, బంగారు కానుక, శ్రీరంగ నీతులు, చిరంజీవితో జగదేకవీరుడు అతిలోక సుందరి, ఎస్పీ పరశురాం, నాగార్జున‌తో ‘ఆఖరి పోరాటం’, వెంకటేష్ తో ‘క్షణక్షణం’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది శ్రీదేవి. తన అందచందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన శ్రీదేవి.. అక్కడ కూడా జెండా పాతింది.

నవరసాలను కళ్లతోనే పలికించగల అరుదైన నటి శ్రీదేవి. ఆమె అభినయ కౌశలం ముందు అన్ని పాత్రలూ తలవంచాయంటే అతిశయోక్తి కాదు. అలా.. భారతీయ చిత్ర పరిశ్రమతో ధ్రువతారలా వెలిగిన శ్రీదేవి.. 2018 ఫిబ్రబరి 24న దుబాయ్‌లో అర్ధాంతరంగా, అనుమానాస్పదంగా కన్నుమూశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్