https://oktelugu.com/

వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌

రాజకీయాల్లో ఆపరేషన్‌ ఆకర్ష్‌ కామన్‌. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలను ఖాళీ చేయాలని చూస్తుంటాయి. ఏ రాష్ట్రంలో చూసినా ఈ పరిస్థితులు కనిపిస్తూనే ఉంటాయి. ఏడాదిన్నర వరకు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అదే చేశారు. వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను బెదిరించి.. భయపెట్టి.. ప్రలోభపెట్టి తన పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని జగన్‌ ఏలుతున్నారు. ఇప్పుడు ఆయనకు టైమ్‌ వచ్చింది. Also Read: జనసేన సత్తా: ఏపీ […]

Written By: , Updated On : February 24, 2021 / 10:57 AM IST
Follow us on

YCP
రాజకీయాల్లో ఆపరేషన్‌ ఆకర్ష్‌ కామన్‌. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలను ఖాళీ చేయాలని చూస్తుంటాయి. ఏ రాష్ట్రంలో చూసినా ఈ పరిస్థితులు కనిపిస్తూనే ఉంటాయి. ఏడాదిన్నర వరకు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అదే చేశారు. వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను బెదిరించి.. భయపెట్టి.. ప్రలోభపెట్టి తన పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని జగన్‌ ఏలుతున్నారు. ఇప్పుడు ఆయనకు టైమ్‌ వచ్చింది.

Also Read: జనసేన సత్తా: ఏపీ ‘పంచాయతీ’లో 27శాతం ఓట్లతో గెలుపు

నిన్నామొన్నటి వరకు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సీజన్‌ నడిచింది. ఇక ఇప్పుడు వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలుపెట్టేందుకు రెడీ అయిపోయింది. పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే ముగిశాయి. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 80 శాతం వైసీపీ గెలుచుకుంది. పల్లె ప్రాంతాల్లో ఏ మాత్రం పట్టుతగ్గలేదని ఈ ఫలితాలతో నిరూపించుకుంది. దీంతో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపుతోంది.

20 నెలల జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. కానీ.. ప్రజలు పంచాయతీ ఎన్నికలకు బారులు తీరారు. దాదాపు 70 శాతానికి పైగానే పోలింగ్ జరిగింది. నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటే అధికార పార్టీ మద్దతుదారులు ఇంత పెద్ద సంఖ్యలో విజయం సాధించి ఉండేవారు కాదు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంతటి విజయాన్ని సాధించిపెట్టాయని చెప్పకతప్పదు.

Also Read: ఏబీఎన్ డిబేట్ లో బీజేపీ నేత విష్ణుపై చెప్పుతో దాడి

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని మరింత బలహీనం చేసేందుకు వైసీపీ ప్రయత్నాలను త్వరలోనే ప్రారంభిస్తుందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడంతో టీడీపీ నేతలు కూడా పునరాలోచనలో పడ్డారంటున్నారు. ఇప్పటికే అనేక చోట్ల ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీ కండువాలు కప్పేసుకుంటున్నారు. కానీ.. ఎమ్మెల్యే స్థాయి నేతలు మాత్రం వైసీపీ వైపు చూడటం లేదు. అయితే త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతున్నట్లు టాక్‌.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్