ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ రసకందాయంలో పడింది. ఈరోజు కీలకమైన మూడో టెస్టుకు రెండు జట్లు సిద్ధమయ్యాయి. ఈ మూడో టెస్టు గెలిచిన జట్టే నేరుగా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు అర్హత సాధిస్తుంది. దీంతో ఇది కీలకంగా మారింది. రెండు జట్లు హోరాహోరీగా పోరాడడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. ఎక్కడెక్కడంటే?
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో జరగబోయే డేనైట్ టెస్టుకు టీమిండియా తుదిజట్టులో పలు కీలక మార్పులు చేసింది. ఇది పింక్ బాల్ టెస్ట్ కావడంతోనాటు రాత్రి అయ్యేకొద్దీ బంతి స్వింగ్ తిరుగుతుంటుంది. కాబట్టి సీమ్ బౌలర్లను తీసుకోవడంపై టీమిండియా దృష్టి సారించింది.
ఈ క్రమంలోనే జట్టులో పలు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే మూడో టెస్టుకు రెండో టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్ స్థానంలో హార్ధిక్ పాండ్యాను , మహ్మద్ సిరాజ్ స్థానంలో బుమ్రాను జట్టులోకి తీసుకోనున్నారని సమాచారం.
Also Read: ఐపీఎల్ కు డేవిడ్ వార్నర్ దూరం.. సన్ రైజర్స్ కు షాక్
ఇక పాండ్యా, బుమ్రా ఇద్దరూ స్టేడియంలోని నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ బాగా చేస్తున్నారు. దీంతో వీరి ఎంపిక ఖాయంగా కనిపిస్తోంది.
* టీమిండియా తుది జట్టు అంచనా ఇదీ
కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, గిల్, పూజారా, రహానే, పంత్, హార్ధిక్ పాండ్యా, అశ్విన్, అక్షర్ పటేల్, ఇంషాంత్ శర్మ, బుమ్రా