Sridevi Assets: దివంగత నటి శ్రీదేవి ఆస్తులు అమ్మేస్తున్నారన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భర్త బోనీ కపూర్ శ్రీదేవి పేరిట ఉన్న నాలుగు ఇళ్ళు విక్రయించారట. తమిళనాడులో పుట్టిన శ్రీదేవి బాల నటిగా పరిశ్రమలో అడుగుపెట్టారు. ఇక హీరోయిన్ గా ఆమె సంచలనాలు నమోదు చేశారు. సౌత్ ఇండియాలో స్టార్ గా వెలిగిన శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా రాణించారు. దాంతో శ్రీదేవికి దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. దశాబ్దాల పాటు ఆమె కెరీర్ సాగింది.
ఈ క్రమంలో ఆమె కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. బాలీవుడ్ లో సెటిల్ అయిన శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకున్నారు. 2018లో శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించారు. ఓ వేడుకకు హాజరయ్యేందుకు శ్రీదేవి దుబాయ్ వెళ్లారు. అక్కడ హోటల్ లో ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి ఊపిరి ఆడక కన్నుమూసింది. ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ కోసం చంపారంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది.
శ్రీదేవి మరణించిన ఇన్నేళ్లకు ఆమె ఆస్తులను భర్త అమ్మేస్తున్నాడట. ఇప్పటికే నాలుగు లగ్జరీ అపార్ట్మెంట్స్ అమ్మేశారట. వీటి విలువ రూ. 12 కోట్లు అని సమాచారం. ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఆ అపార్ట్మెంట్స్ అమ్మారట. శ్రీదేవి ఆస్తులు భర్త సడన్ గా పెద్ద మొత్తంలో అమ్మడం హాట్ టాపిక్ అవుతుంది. బోనీ కపూర్ రెండో వివాహంగా శ్రీదేవిని చేసుకున్నారు.
ఆయన మొదటి భార్యకు అర్జున్ కపూర్, అన్షుల కపూర్ పుట్టారు. శ్రీదేవికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ పెట్టారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర చిత్రంలో నటిస్తుంది. చిన్న కూతురు ఖుషి కపూర్ ఇటీవల ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన ది ఆర్చీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. జాన్వీ కపూర్ నటిగా, మోడల్ గా సంపాదిస్తుంది.