Nagarjuna: స్టార్ హీరోగా నాగార్జున లాంగ్ కెరీర్ కలిగి ఉన్నారు. ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. మరోవైపు టీవీ వ్యాఖ్యాతగా రికార్డు టీఆర్పీ లు రాబడుతూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ఆయన హోస్ట్ గా స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్.. సూపర్ సక్సెస్ అయ్యింది. గత మూడు సీజన్స్ గా బిగ్ బాస్ షోని విజయపథంలో నడిపిస్తున్నారు నాగార్జున. ఇటీవలే ఆయన సీజన్ 5 ముగించారు.

బిగ్ బాస్ సీజన్ 5 ముగిసి వారం కూడా గడవక ముందే మరో సంచలన ప్రకటన చేశారు నాగార్జున. ఓటిటి లో ప్రసారం కానున్న బిగ్ బాస్ షోకి ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దీనిపై నేడు అధికారిక ప్రకటన జరిగింది. నాగార్జున మీడియా వేదిక ఈ షోకి సంబంధించిన పలు కీలక విషయాలను పంచుకున్నారు. ప్రముఖ ఓటిటి దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ షో ప్రసారం కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రతినిధులతో పాటు నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు.
ఇక ఓటిటి బిగ్ బాస్ షో కంప్లీట్ డిఫరెంట్ ఫార్మాట్ లో సాగుతుందని, దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని నాగార్జున తెలిపారు. అయితే బిగ్ బాస్ షోపై సాంప్రదాయ వాదుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ఈ షో నిర్వహిస్తున్న తీరు, గేమ్స్, టాస్క్ ని కొందరు తప్పుబడుతున్నారు. ప్రధానంగా ఒకే హౌస్ లో అమ్మాయిలు, అబ్బాయిలు నివసించడం, వారి మధ్య రొమాన్స్, రిలేషన్స్ సమాజానికి మంచిది కాదంటున్నారు.
Also Read: BigBoss 5: షణ్ముఖ్, సిరి రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన సన్ని
కంటెంట్ పై పరిమితులు కలిగిన టెలివిజన్ ఫార్మాట్ లోనే కంటెస్టెంట్స్ మధ్య మితిమీరిన రొమాన్స్ చోటు చేసుకుంటుంది. అమ్మాయిలు, అబ్బాయిలు పొట్టి బట్టలలో అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నారు. అలాంటిది స్వేచ్ఛాయుతమైన ఓటిటి ఫార్మాట్ లో కంటెస్టెంట్స్ ఏ రీతిలో రెచ్చిపోనున్నారనే ఆందోళన కలుగుతుంది. ఓటిటిలో ప్రసారమయ్యే సినిమాలు, సిరీస్లలో మోతాదుకు మించిన అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ఓటిటి లో సెక్స్, వైలెన్స్ కంటెంట్ ప్రసారంపై ప్రభుత్వం ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తుంది.
బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలలో మరింత అడల్ట్ కంటెంట్ చోటు చేసుకునే ప్రమాదం కలదు. బిగ్ బాస్ హోస్ట్ గా అనేక విమర్శలు ఎదుర్కొంటున్న నాగార్జున.. ఓటిటి హోస్ట్ గా బాధ్యతలు తీసుకోవడం సాహసమే. మరి ఆయన హోస్ట్ కాబట్టి, కంటెంట్ విషయంలో బాధ్యత తీసుకుంటారేమో.
Also Read: హౌస్ లో షణ్ముఖ్-సిరి ఏం చేశారు?… సన్నీ మెడకు చుట్టుకున్న వ్యవహారం