https://oktelugu.com/

నీ గురించి నాకు తెలుసు బుజ్జి.. అంటున్న శ్రీరెడ్డి

బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై పలు వ్యాఖ్యలు చేసింది. ఇందులో అమ్మాయిలే తప్పు అన్న రీతిలో నందిని రాయ్ వ్యాఖ్యలు ఉండటంతో తీవ్ర దుమారం రేగింది. నందిని రాయ్ వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిస్తే.. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాదని.. ఇది అన్నిరంగంల్లోనూ ఉందని చెప్పింది. మిగతా ఇండస్ట్రీలతో పొలిస్తే ఒకరకంగా చిత్రసీమనే బెటరని సెలవిచ్చింది. అయితే తనకు సినిమా పరిశ్రమలో ఇలాంటి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 26, 2020 / 04:39 PM IST
    Follow us on


    బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై పలు వ్యాఖ్యలు చేసింది. ఇందులో అమ్మాయిలే తప్పు అన్న రీతిలో నందిని రాయ్ వ్యాఖ్యలు ఉండటంతో తీవ్ర దుమారం రేగింది. నందిని రాయ్ వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిస్తే.. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాదని.. ఇది అన్నిరంగంల్లోనూ ఉందని చెప్పింది. మిగతా ఇండస్ట్రీలతో పొలిస్తే ఒకరకంగా చిత్రసీమనే బెటరని సెలవిచ్చింది. అయితే తనకు సినిమా పరిశ్రమలో ఇలాంటి అనుభవాలు ఎదురుకాలేదని చెప్పింది. తన ఫ్రెండ్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారని వారి చెప్పే కొన్ని విషయాలు వింటుంటే ఒకరకంగా సినిమా ఇండస్ట్రీనే బెటర్ అని స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేకాదు అమ్మాయిలైనా.. హీరోయిన్లు అయినా ‘నో’ అని చెబితే ఎవరూ ఏం చేయలేరని.. ‘నో’ అన్నాక బలవంతం చేసే పరిస్థితులు ఉండవని చెప్పింది. ఇదంతా అమ్మాయిలు వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంటుందని నందిని రాయ్ చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు.

    టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా శ్రీరెడ్డి గతంలో గళం విప్పింది. అర్ధనగ్న ప్రదర్శన చేసి అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. వీలుచిక్కినప్పుడల్లా ఇండస్ట్రీలోని బాగోతాలను బహిర్గతం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని చెప్పింది. అదేవిధంగా అవకాశాల కోసం వెళ్లిన వారిపట్ల కొందరు కమ్మిట్మెంట్ పేరిట వేధింపులు చేస్తారని ఆరోపించింది. ఈనేపథ్యంలో ఇటీవల నందిని రాయ్ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందించింది. ‘ఓ అమ్మాయి పని కోసం వెళ్లింది.. అలాంటప్పుడు సెక్స్ కావాలని ఎవరైనా అడిగితే అది క్యాస్టింగ్ కౌచ్ అవుతుంది నందిని.. కానీ మనమే డైరెక్ట్ గా ఆఫర్ చేస్తే అది క్యాస్టింగ్ కౌచ్ కాదు.. నీ గురించి నాకు బాగా తెలుసు.. నువ్వు నా స్నేహితురాలివి.. అది మరిచిపోకు బుజ్జి..’ అంటూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్టు చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన పోస్టు నెట్టింట్ల వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి ఒక్క పోస్టుతో నందిని రాయ్ ను క్లీన్ బోల్డ్ చేసిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై నందిని రాయ్ ఎలా రియాక్టవుతుందో వేచి చూడాల్సిందే.