Sri Reddy: వివాదాస్పద నటి, యూట్యూబర్ శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఎప్పుడూ తన పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంటారు. అంతే కాదు సోషల్ మీడియాలో ఆమె జగన్ కోసం పని చేస్తూ ఉంటారు. జగన్ మోహన్ రెడ్డిని ఎవరైనా ఏమైనా అంటే తన స్టైల్ లో జవాబిస్తుంటుంది. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారికి హద్దులు దాటి కౌంటర్లు ఇస్తుంటుంది.
జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)కి వీరాభిమాని అయిన శ్రీరెడ్డి తాజా ఎన్నికల ఫలితాలపై స్పందించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) కూటమి ఘన విజయం సాధించింది. ఏకంగా 164 స్థానాల్లో గెలిచింది. ఎవరూ ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. అయితే జగన్ మోహన్ రెడ్డి కి మద్దతుగా శ్రీరెడ్డి వరుస పోస్టులు చేస్తుంది.
Also Read: Anasuya: వయసులో అనసూయ ఎలా ఉండేదో తెలుసా… సంచలన ఫోటోలు వైరల్
అయితే తాజాగా శ్రీరెడ్డి ‘ బాధపడకు జగనన్న .. క్యాడర్ కు కొత్త ఊపిరి పోయాలి. నిలబడు, పోరాడు. నిన్ను నమ్ముకున్న వాళ్ళ అందరి కోసం బలం తెచ్చుకో .. ఇక రోజూ ఒక పోరాటమే .. విజయం ఉన్న వాళ్ళ వైపు జారబడే వాళ్ళు ఎక్కువ. వెక్కిరించే వెధవల కోసం కాదు .. నీ సైన్యం కోసం పోరాడాలి అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అయితే కొందరు శ్రీరెడ్డి టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
Also Read: Vikram Thangalaan: విక్రమ్ తంగలన్ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడు..?
ఆమెకు సంబంధించిన పోస్ట్ ఒకటి వైరల్ చేస్తున్నారు. ‘ జగనన్న ఈ ఎన్నికల్లో గెలవక పోతే బీచ్ లో బట్టలు విప్పేసి తిరుగుతా ‘ అని శ్రీరెడ్డి గతంలో వేసిన పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు. జగన్ ఓడిపోయాడుగా ఇప్పుడు నిజంగానే బట్టలు విప్పేసి తిరుగు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వల్గర్ కామెంట్స్ కి శ్రీరెడ్డి తన స్టైల్ లో ఇచ్చిపడేసింది. ‘ తప్పుడు ప్రచారాలు చేస్తే చెప్పుతో కొడతా. బట్టలు విప్పేసి తిరుగుతా అని నేనెప్పుడు అన్నానురా. ల … లారా అంటూ ఘాటుగా జవాబిచ్చింది.