https://oktelugu.com/

Love Mouli: ఆర్ ఆర్ ఆర్ స్టోరీకి ‘‘లవ్ మౌళి’’ సినిమా డైరెక్టర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా స్టోరీకి ఇప్పుడు నవదీప్ హీరోగా వస్తున్న లవ్ మౌళి సినిమా డైరెక్టర్ కి మధ్య సంబంధం ఏంటి అనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 6, 2024 / 05:56 PM IST

    Love Mouli

    Follow us on

    Love Mouli: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంత ఇంత కాదు… బాహుబలి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఆయన తెలుగు సినిమా స్థాయిని కూడా పాన్ ఇండియా రేంజ్ కు పరిచయం చేశాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తూ భారీ కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇదిలా ఉంటే రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా స్టోరీకి ఇప్పుడు నవదీప్ హీరోగా వస్తున్న లవ్ మౌళి సినిమా డైరెక్టర్ కి మధ్య సంబంధం ఏంటి అనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే రాజమౌళి దగ్గర లవ్ మౌళి సినిమా డైరెక్టర్ అయిన అవనీంద్ర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూనే రైటర్ అయిన విజయేంద్రప్రసాద్ దగ్గర స్క్రిప్ట్ అసోసియేట్ గా కూడా వర్క్ చేశారట. ఇక ఇలాంటి సమయంలో వీళ్లిద్దరూ కలిసి ఆ కథ రాసినట్టుగా తను ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

    అయితే ఈ సినిమా స్టోరీ ని రాసేటప్పుడు దీనికి సీక్వెల్ ఉండే విధంగా రాయమని రాజమౌళి ముందే వీళ్లకు సలహా అయితే ఇచ్చాడట. ఇక మొత్తానికైతే వీళ్ళు అలాంటి కథను రెడీ చేసి రాజమౌళి చేతిలో పెట్టారు మరి దీనికి సీక్వెల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కానీ రాజమౌళి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని అనుకుంటున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం అవనీంద్ర ‘లవ్ మౌళి’ అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు.

    ఇది జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే తను ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు. లేకపోతే మాత్రం తను డైరెక్టర్ గా కొనసాగడం చాలా కష్టమని చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అయితే చాలా కొత్తగా ఉంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…