https://oktelugu.com/

Anasuya: వయసులో అనసూయ ఎలా ఉండేదో తెలుసా… సంచలన ఫోటోలు వైరల్

Anasuya: అనసూయ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చదువుకునే రోజుల్లో ఆమె ఎన్సీసీ క్యాడెట్. ఢిల్లీ లో కూడా క్యాంపు చేసింది. ఈ క్రమంలో ఆమె ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒక ఎన్సీసీ క్యాంప్ కి వెళ్ళింది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 6, 2024 / 01:56 PM IST

    anasuya bharadwaj old pics goes viral on social media

    Follow us on

    Anasuya: అనసూయ భరద్వాజ్ వయసులో ఎలా ఉండేది. ఆమె ఒకప్పటి ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. భర్త సుశాంక్ భరద్వాజ్(Susank Bharadwaj) తో గతంలో దిగిన ఫోటోలు షేర్ చేసిన అనసూయ అందరినీ షాక్ కు గురి చేసింది. అనసూయ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చదువుకునే రోజుల్లో ఆమె ఎన్సీసీ క్యాడెట్. ఢిల్లీ లో కూడా క్యాంపు చేసింది. ఈ క్రమంలో ఆమె ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒక ఎన్సీసీ క్యాంప్ కి వెళ్ళింది. అక్కడ సుశాంక్ పరిచయం అయ్యాడు.

    సుశాంక్ బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. అనసూయకు ఇంటర్ లోనే ప్రపోజ్ చేశాడట. అప్పుడు అనసూయ ఆలోచనలో పడిందట. మరలా డిగ్రీ చదువుతున్న సమయంలో ఎన్సీసీ క్యాంపు కి అనసూయ, సుశాంక్ వెళ్లారట. అప్పుడు వీరి ప్రేమ బలపడింది. అయితే పెళ్లి చేసుకోవడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా అనసూయ తండ్రి ససేమిరా అన్నాడట.

    Also Read: Vikram Thangalaan: విక్రమ్ తంగలన్ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడు..?

    నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే చెల్లికి పెళ్లి కాదని సీరియస్ అయ్యాడట. అనసూయ వినకపోవడంతో ఆమె బట్టలు బయటకు విసిరేశాడట తండ్రి. ఇంటి నుండి బయటకు వచ్చేసిన అనసూయ లేచిపోయి పెళ్లి చేసుకుందాం అందట. సుశాంక్ మాత్రం ఒప్పుకోలేదట. పెద్దల అనుమతితోనే వివాహం చేసుకుందామని తెగేసి చెప్పాడట. దాదాపు పదేళ్ల బంధం అనంతరం వారికి ముడి పడింది. అనసూయ తండ్రి సుశాంక్ కి ఒప్పుకున్నాడట.

    Also Read: Venkatesh: వెంకటేష్ సెంటిమెంట్ సినిమాలకి కాలం చెల్లిందా..?

    కాగా సుశాంక్ తో తన జ్ఞాపకాలను అనసూయ పంచుకుంది. పెళ్లి కాకముందటి ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ముందు అనసూయ ఇలా ఉండేదా అని అవాక్కు అవుతున్నారు. మరోవైపు నటిగా అనసూయ ఫుల్ బిజీ. ఆమె చేతినిండా చిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె నటించిన పుష్ప 2(Pushpa 2) కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2లో ఆమె లేడీ విలన్ రోల్ చేసింది. దాక్షాయణిగా మరోసారి మెస్మరైజ్ చేయనుంది.