శ్రీరెడ్డి.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆమె ఓ హాట్ బ్యూటీ. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీ సంపాదించింది. దాదాపు రెండు మూడేళ్లుగా ఆమె చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉదంతాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆమె అలజడి సృష్టించిందనే చెప్పాలి. అంతేకాదు.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తన టాప్ లేపి మరీ ఎద అందాలను చూపిస్తున్న సెల్ఫీని షేర్ చేసి హీటెక్కించింది.
Also Read: సింగర్ గా మారుతున్న వింక్ బ్యూటీ.. గాత్రంతో మాయ చేస్తుందా..?
కాస్టింగ్ కౌచ్ తెలుగు సినీ పరిశ్రమలోనూ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. అప్పటి నుంచి తరచూ పలు టీవీ ఛానెళ్లలో చర్చల్లో పాల్గొని ఎన్నో షాకింగ్ విషయాలు చెప్పింది. అంతేకాదు.. చాలా మంది దర్శక నిర్మాతల వల్ల అమ్మాయిలు బలైపోతున్నారని చెప్పింది. ఆ సమయంలోనే ఫిలిం చాంబర్ ముందు నగ్న నిరసన చేసి దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలో శ్రీరెడ్డికి ఊహించని రీతిలో మద్దతు లభించింది. చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు సైతం మీడియా ముందుకు వచ్చారు. అలాగే.. సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసింది.
నాటి నుంచి శ్రీరెడ్డి చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఎంతటి బిగ్ సెలెబ్రిటీనైనా సరే ఏకవచనంతో సంభోదించడంతోపాటు బూతులు తిట్టడమే ఆమె పని. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది హీరోలు, హీరోయిన్లను సైతం టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించింది. అలాగే, పాలిటిక్స్ మీదా ఫోకస్ చేయడంతోపాటు పలువురు నాయకులపై కామెంట్స్ చేసింది. అంతేకాదు.. కోలీవుడ్‌కు చెందిన కొందరు ఆర్టిస్టులు, నిర్మాతలు, దర్శకులతో చనువుగా ఉన్న ఫొటోలను సైతం వదిలింది.
Also Read: భార్యలో నచ్చిన క్వాలిటీ అదే.. బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు..?
కానీ.. ఈ మధ్య ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో సోషల్ మీడియా ద్వారానే ఆమె తన అభిప్రాయాలను చెబుతోంది. అదే సమయంలో తన అందాలతో కుర్రకారును హుషారెత్తించేందుకు హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసి హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో గ్లామరస్ ఫొటోలను వదిలిన శ్రీరెడ్డి.. అప్పుడప్పుడు న్యూడ్ ట్రీట్ కూడా ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఎద అందాలను చూపించేలా టాప్‌ను లేపిన ఫొటోను షేర్ చేసింది. దానిని కొంచెం బ్లర్ చేసిన ఆమె.. ‘ఏదైనా బ్లర్‌గానే ఉంటుంది. కానీ ఫీలింగ్స్ నిజమైనవి. కొన్ని సార్లు తెలుపు రంగు మనల్ని శాంతంగా ఉండేలా చేస్తుంది’ అని రాసుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్