https://oktelugu.com/

రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి.. కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని..!

కొత్త ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా జనవరి 2న దేశంలోని అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ చేపట్టగా విజయవంతం అయినట్లు కేంద్రం ప్రకటించింది. Also Read: ఓ వైపు చలి.. దానికితోడు వర్షం.. అయినా పట్టువదలని రైతులు నేడు డీసీజీఐ(డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) రెండు కరోనా వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చింది. దీంతో కరోనా వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు మార్గం సుగమం అయింది. సీరమ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 3, 2021 / 04:53 PM IST
    Follow us on

    కొత్త ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా జనవరి 2న దేశంలోని అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ చేపట్టగా విజయవంతం అయినట్లు కేంద్రం ప్రకటించింది.

    Also Read: ఓ వైపు చలి.. దానికితోడు వర్షం.. అయినా పట్టువదలని రైతులు

    నేడు డీసీజీఐ(డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) రెండు కరోనా వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చింది. దీంతో కరోనా వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు మార్గం సుగమం అయింది.

    సీరమ్ ఇనిస్టిట్యూట్.. భారత్ బయోటెక్ తయారు చేసిన రెండు వ్యాక్సిన్లకు నేడు డీసీజీఐ అనుమతి ఇవ్వడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ తయారీలో పాలుపంచుకున్న ప్రతీఒక్కరిని అభినందించారు.

    Also Read: ఆ వ్యాక్సిన్లకు జెట్‌ స్పీడ్‌లో పర్మిషన్‌..: వారంలోనే వ్యాక్సినేషన్‌

    సైంటిస్టులు.. వైద్యులు.. ఇన్నోవేటర్స్ కృషి ఫలితంగా ఆరోగ్యవంతమైన.. కోవిడ్ రహిత భారతదేశానికి మార్గం సుగమం అయిందంటూ హర్షం వ్యక్తం చేశారు.

    ప్రపంచానికి అందించే వ్యాక్సిన్లు ఇండియాలోనే తయారవడం భారతీయులందరికీ గర్వకారణమని తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పోరాడిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మీ సేవలను దేశం ఎన్నటికీ మర్చిపోదని కొనియాడారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్