https://oktelugu.com/

పెళ్లి చేసుకునే వారికి షాకింగ్ న్యూస్.. వారం తర్వాత ముహుర్తాలు లేవట..!

2021 సంవత్సరం పెళ్లి చేసుకోవాలనుకునే యువతీయువకులకు భారీ షాక్ ఇచ్చింది. పండితులు ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పెళ్లి ముహుర్తాలు తక్కువని చెబుతున్నారు. జనవరి నెల 8వ తేదీ వరకు పెళ్లి చేసుకోవడానికి మంచి ముహుర్తాలు ఉండగా ఆ తరువాత మే నెల వరకు మంచి ముహుర్తాలు లేకపోవడం గమనార్హం. ఈ నెల 7వ తేదీన మంచి ముహూర్తమని పండితులు వెల్లడిస్తున్నారు. Also Read: సింగర్ గా మారుతున్న వింక్ బ్యూటీ.. గాత్రంతో మాయ చేస్తుందా..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 3, 2021 / 05:23 PM IST
    Follow us on


    2021 సంవత్సరం పెళ్లి చేసుకోవాలనుకునే యువతీయువకులకు భారీ షాక్ ఇచ్చింది. పండితులు ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పెళ్లి ముహుర్తాలు తక్కువని చెబుతున్నారు. జనవరి నెల 8వ తేదీ వరకు పెళ్లి చేసుకోవడానికి మంచి ముహుర్తాలు ఉండగా ఆ తరువాత మే నెల వరకు మంచి ముహుర్తాలు లేకపోవడం గమనార్హం. ఈ నెల 7వ తేదీన మంచి ముహూర్తమని పండితులు వెల్లడిస్తున్నారు.

    Also Read: సింగర్ గా మారుతున్న వింక్ బ్యూటీ.. గాత్రంతో మాయ చేస్తుందా..?

    పెళ్లీడుకొక్ఛిన యువతీయువకులకు పెళ్లి ముహుర్తాలు తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీ లోపు పెళ్లి చేసుకోవడం సాధ్యం కాకపోతే మే నెల 14వ తేదీన మంచి ముహూర్తం ఉంది. జనవరి 14వ తేదీ నుంచి శూన్య మాసం ప్రారంభం కానుండగా ఫిబ్రవరి 12 వరకు గురు మౌఢ్యమి ఉంటుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మే నెల 4వ తేదీ వరకు శుక్ర మౌఢ్యమి ఉంటుంది.

    Also Read: అల్పాహారంలో వీటిని తింటున్నారా.. ఆ వ్యాధులు వచ్చే ఛాన్స్…?

    మే 4వ తేదీ తరువాత కొన్నిరోజుల పాటు మంచి ముహూర్తాలు లేవు. మే 14 తర్వాత కూడా ఎక్కువగా ముహుర్తాలు లేవు. అందువల్ల ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లు ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. జీవితంలో పెళ్లి ముఖ్యమైన ఘట్టమని.. గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి పెళ్లికి మంచి రోజుకు కావని పండితులు చెబుతున్నారు. గతేడాది వల్ల కరోనా వల్ల ఎక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు జరగలేదు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    అయితే ఈ ఏడాది అయినా పెళ్లి చేసుకోవాలనే వాళ్లను ముహుర్తాల సమస్య వేధిస్తోంది. పెళ్లిని మంచి ముహుర్తంలోనే చేసుకోవాలని లేకపోతే పెళ్లి తర్వాత సమస్యలు తప్పవని పండితులు చెబుతున్నారు.