Sreemukhi: గ్లామర్ షో అంతకంతకూ పెంచుకుంటూ పోయిన శ్రీముఖి చివరకు బికినీ కూడా వేసేసింది. బ్లాక్ కలర్ బికినీ ధరించిన శ్రీముఖి బీచ్ లో బోల్డ్ ఫోజుల్లో హీటెక్కించింది. గోవా వెకేషన్ లో ఉన్న శ్రీముఖి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ తెలుగు యాంకర్ బికినీ ధరించడం నిజంగా సంచలనమే. గ్లామర్ షోకి కేర్ ఆఫ్ అడ్రెస్ గా చెప్పుకునే రష్మీ, అనసూయ కూడా ఈ రేంజ్ లో స్కిన్ షో చేయలేదు. వారిద్దరి కంటే ఓ అడుగు ముందుకేసి టూ పీస్ బికినీలో జాతర చేసింది.

ఆ బికినీకి తోడు బోల్డ్ ఫోజుల్లో సాగర తీరంలో సునామీ సృష్టించింది. వెల్లకిలా కూర్చొని ఎదపై ఆకు ఉంచి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. తెలుగు యాంకరింగ్ కి రష్మీ, అనసూయ, శ్రీముఖి మీనింగ్ మార్చేస్తున్నారు. లేడీ యాంకర్ సంప్రదాయాలు బ్రేక్ చేసిన ఘనత ఈ ముగ్గురికే దక్కుతుంది.
ఒకప్పుడు తెలుగు యాంకర్ అంటే నిండైన బట్టల్లో సాంప్రదాయం ఉట్టిపడేలా ఉండేవారు. సుమ, ఉదయభాను, ఝాన్సీ వంటి స్టార్ యాంకర్స్ చీర, చుడిదార్ దాటి వెళ్ళలేదు. ఉదయభాను మాత్రం జీన్స్ వంటి ట్రెండీ వేర్స్ లో కొన్ని షోస్ చేశారు. స్కిన్ షో చేయడం అనేది వారికి తెలియదు. ఈ జెనరేషన్ యాంకర్స్ ఆ బౌండరీలు బ్రేక్ చేశారు.

జబర్దస్త్ వేదికగా అనసూయ, రష్మీ స్కిన్ షో ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఆ ఫార్ములా సక్సెస్ కావడంతో వారిని కొత్తవారు అనుసరిస్తున్నారు. శ్రీముఖి, విష్ణుప్రియ, వర్షిణి లాంటి యాంకర్స్ రష్మీ, అనసూయల స్ఫూర్తితో బుల్లితెర మీద గ్లామర్ షో చేస్తున్నారు. మొదట్లో కొంచెం కొత్తగా అనిపించినా మెల్లగా ఆడియన్స్ అలవాటు పడ్డారు. సంప్రదాయవాదులు ఎంత ఖండిస్తున్నా వాళ్ళను పట్టించుకున్న నాథుడు లేడు. ట్రెండ్ తో పాటు మారాలి అంటూ సర్ది చెబుతున్నారు.
బుల్లితెర మీద శ్రీముఖి జోరు కొనసాగుతోంది. సుమ ఇదివరలా పెద్ద మొత్తంలో షోస్ చేయడం లేదు. ఏళ్ల తరబడి చేసి ఆమెకు విసుగెత్తి పోయారు. అనసూయకు సినిమా అవకాశాలు రావడంతో ఆమె కూడా యాంకరింగ్ ని లైట్ తీసుకుంటున్నారు. ఇది శ్రీముఖికి కలిసొస్తుంది. టాప్ 5లో ఉన్న శ్రీముఖి మేకర్స్ నెక్స్ట్ ఆప్షన్ అవుతున్నారు.

నాలుగైదు బుల్లితెర షోస్ శ్రీముఖి చేతిలో ఉన్నాయి. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న డాన్స్ ఐకాన్ షో కూడా చేస్తున్నారు. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ కావడంతో అసలు హద్దులు దాటేస్తుంది. విచ్చలవిడిగా స్కిన్ షో చేస్తుంది. మరోవైపు శ్రీముఖి హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె హీరోయిన్ గా ఒకటి రెండు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే బ్రేక్ ఇచ్చే సాలిడ్ ఆఫర్ కోసం ఎదురుచూస్తుంది. మరి శ్రీముఖి కలలు ఏ మేరకు విజయం సాధిస్తాయో చూద్దాం…