Sreeleela: సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధిస్తే.. డబ్బే డబ్బు వస్తుంది. ఫేమస్, అభిమానులతో పాటు డబ్బు కూడా ఫుల్ గానే సంపాదిస్తుంటారు నటీనటులు. కానీ ఈ స్టేటస్ రావాలంటే చాలా కష్టపడాల్సిందే. ఒక సారి ఆ స్టేటస్ వస్తే నిలబెట్టుకోవడం కోసం కూడా చాలా కష్టపడాలి. అయితే హీరోయిన్లు కొందరు మంచి పాత్రలను మాత్రమే ఎంచుకుంటే.. మరికొందరు డబ్బు కోసం బోల్డ్ క్యారెక్టర్లను కూడా ఎంచుకుంటారు.సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా మరీ నటిస్తుంటారు.
కొందరు యాడ్ ల విషయంలో కూడా హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. కానీ ఈ విషయంలో శ్రీలీల పూర్తిగా వ్యతిరేకం అని చెప్పాలి. ప్రతి హీరోయిన్ ఒకేలా ఉండదనడానికి ఈమె నిదర్శనం. ఈమె చాలా మంది హీరోయిన్ లకు భిన్నంగా నిలుస్తుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడి పారితోషికం రూ. 3నుంచి 4 కోట్లు. రీసెంట్ గానే ఎంట్రీ ఇచ్చి హిట్ లను సంపాదిస్తూ సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే శ్రీలీల ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది.
బెట్టింగ్ యాప్ లకు, మద్యం బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఆఫర్లు వస్తే సున్నితంగా రిజక్ట్ చేసిందట శ్రీలీల. ఇలా కొన్ని యాడ్ లలో నటించకూడదని నిబందనలు పెట్టుకొని మంచి పాత్రలున్న సినిమాలు, యాడ్ లలో మాత్రమే నటిస్తూ అమ్మడు తన రేంజ్ ను పెంచుకుంటుంది. దీంతో ఒక్కో మెట్టు ఎదుగుతున్న హద్దులు దాటకుండా మంచిని మాత్రమే ఎంచుకునే శ్రీలీల మనస్తత్వానికి మరింత అభిమానులు పెరిగిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
శ్రీలీల భవిష్యత్తులో సైతం ఇవే నిబంధనలను ఫాలో కావాలని నెటిజన్ల కోరుకుంటున్నారు. మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఈమెకు కెరీర్ పరంగా తిరుగు ఉండదు. లేదంటే త్వరలోనే ఈమె కెరీర్ కూడా అయిపోతుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి ఫ్యూచర్ లో ఈ అమ్మడు ఎలాంటి క్యారెక్టర్లను ఎంచుకుంటుందో చూడాలి.