spot_img
Homeఎంటర్టైన్మెంట్Anjali: అంజలి పెళ్లి నిజంగానే జరిగిపోయిందా? వీటిపై అంజలీ ఏమందంటే..

Anjali: అంజలి పెళ్లి నిజంగానే జరిగిపోయిందా? వీటిపై అంజలీ ఏమందంటే..

Anjali: జర్నీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ అంజలి. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి సినిమాల్లో నటిస్తూ తన కెరీర్ ను మలుచుకుంది. బోల్డ్ క్యారెక్టర్లకు తావు ఇవ్వలేదు అంజలి. ఈ అమ్మడు నటించిన సినిమాలు ఆల్మోస్ట్ హిట్ సినిమాలే. తమిళ సినిమాతో పరిచయం అయిన అమ్మడు తన అదృష్టాన్ని బాలీవుడ్ లో కూడా పరీక్షించుకుంది. ఇక టాలీవుడ్ లో హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు కీలక పాత్రల్లో నటించింది. ఈమధ్య తెలుగు సినిమాలను తగ్గించింది బ్యూటీ.

తాజాగా అంజలి తెలుగులో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ అమ్మడు నటించిన గీతాంజలి సినిమా హిట్ టాక్ ను సంపాదించడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగింది. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా కు సీక్వెల్ రానుంది. అంటే గీతాంజలి 2 సినిమాతో మరోసారి భయపెట్టడానికి సిద్దమవుతుంది అంజలి. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను కూడా ప్రెస్ మీట్ లో తెలిపారు చిత్రయూనిట్. ఈ అమ్మడు తెలుగులో నటించకపోవడంతో అభిమానులు మరింత నిరాశ చెందారు. కానీ ఈ అప్డేట్ తో హుషారు అవుతున్నారు.

ఇదిలా ఉంటే అంజలి పెళ్లి గురించి ప్రతి సారి ఏదో ఒక వార్త వైరల్ గా మారుతుంటుంది. గతంలోనే ఓ హీరోతో లవ్ ట్రాక్ నడిపిస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో వాస్తవం లేదనే క్లారిటీ వచ్చేసింది. అయితే మరోసారి అంజలి పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంజలి పెళ్లి జరిగిందని.. ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గానే ఉంచిందని టాక్ వినిపిస్తుంది. ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుందని ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిందని టాక్ వస్తుంది. అయితే ఈ వార్తలపై అంజలి స్పందించింది.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన అంజలీ.. నా పెళ్లిపై ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్లు రాసుకున్నారు. అప్పట్లో హీరో జైను ప్రేమిస్తున్నట్టు రాశారని, ఇప్పుడు ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయినట్లు ప్రచారం జరుగుతుందని తెలిపిందే. ఇవన్నీ వింటుంటే నాకు నవ్వు వస్తుంది. నాకే తెలియకుండా నా పెళ్లి చేసేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. అంటే ఈ వార్తలతో పెళ్లి టాపిక్ కు చెక్ పెట్టేసింది అమ్మడు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...
Oktelugu Epaper
Exit mobile version