Homeఎంటర్టైన్మెంట్Sree Vishnu Vishnu Vinyasam Box Office Collections: 12 కోట్ల టార్గెట్ తో దిగిన...

Sree Vishnu Vishnu Vinyasam Box Office Collections: 12 కోట్ల టార్గెట్ తో దిగిన ‘విష్ణు విన్యాసం’.. 2 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతంటే!

Sree Vishnu Vishnu Vinyasam Box Office Collections: శ్రీ విష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam), నిజంగానే బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త విన్యాసాలు చేస్తోంది. మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన డివైడ్ టాక్ ని చూసి, ఫిబ్రవరి నెలలో మరో భారీ ఫ్లాప్ అని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రం అందరి అంచనాలను దాటిపోయింది. బుక్ మై షో యాప్ ని గమనిస్తే మొదటి రోజు ఈ చిత్రానికి 31 వేల టికెట్స్ అమ్ముడుపోగా , రెండవ రోజు ఏకంగా 50 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. మీడియం రేంజ్ హీరో సినిమాకు , డివైడ్ టాక్ తో ఇలాంటి ట్రెండ్ ఉండడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇకపోతే శ్రీ విష్ణు వరుసగా సూపర్ హిట్స్ లో ఉండడంతో ఈ చిత్రానికి విడుదలకు ముందు 12 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Also Read: లోకేష్ కు అలా అవకాశం ఇచ్చిన చంద్రబాబు!

మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు 1 కోటి 68 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల నుండి దాదాపుగా 1 కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రెండవ రోజున నమోదు అవ్వగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 2 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండే మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. వరుస సూపర్ హిట్స్ తో శ్రీ విష్ణు ఏర్పాటు చేసుకున్న బ్రాండ్ ఇమేజ్ కారణంగానే ఈ చిత్రానికి కాస్త టాక్ తేడా గా వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఇకపోతే ఓవరాల్ గా మొదటి రెండు రోజులకు కలిపి ఈ చిత్రానికి 3 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈరోజు మొదటి రెండు రోజులకంటే ఎక్కువ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొదటి మూడు రోజులకు కలిపి ఈ చిత్రం 6 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంటున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని, రాబోయే రోజుల్లో మంచి సినిమాలు కూడా విడుదల లేకపోవడం వల్ల , కచ్చితంగా ఈ చిత్రం సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుందని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular