https://oktelugu.com/

శ‌ర్వానంద్ తో పోటీకి సిద్దమవుతున్న శ్రీ‌విష్ణు !

శ్రీ‌విష్ణు హీరోగా, అనీష్ కృష్ణ ద‌ర్శ‌‌క‌త్వంలో తెరకెక్కుతున్న ‘గాలి సంప‌త్‌’ చిత్రానికి దర్శకుడు అనిల్‌ రావిపూడి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూనే స్క్రీన్‌ప్లే అందించటంతో ఈ మూవీ మీద అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ద్వారా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మిత్రుడు ఎస్‌.కృష్ణ నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా మీద ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. Also Read: ఈ వీక్ టాలీవుడ్ ట్రేడ్ టాక్ టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు […]

Written By:
  • admin
  • , Updated On : January 24, 2021 / 02:27 PM IST
    Follow us on


    శ్రీ‌విష్ణు హీరోగా, అనీష్ కృష్ణ ద‌ర్శ‌‌క‌త్వంలో తెరకెక్కుతున్న ‘గాలి సంప‌త్‌’ చిత్రానికి దర్శకుడు అనిల్‌ రావిపూడి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూనే స్క్రీన్‌ప్లే అందించటంతో ఈ మూవీ మీద అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ద్వారా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మిత్రుడు ఎస్‌.కృష్ణ నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా మీద ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది.

    Also Read: ఈ వీక్ టాలీవుడ్ ట్రేడ్ టాక్

    టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి కానున్నారని, డిస్ట్రిబ్యూషన్ భాద్యత కూడా ఆయనే తీసుకున్నారని తెలియచేస్తూ న్యూ పోస్టర్ ఒకటి రిపబ్లిక్ డే రోజున విడుదల చేయనున్నారని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాని మార్చి నెలలో శివరాత్రి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారని , ఆ విషయాన్ని కూడా అధికారకంగా ప్రకటిస్తారని సమాచారం.

    ఇప్పటికే మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న శ‌ర్వానంద్ న్యూ మూవీ ‘శ్రీ‌కారం’ను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు శ‌నివారం చిత్ర బృందం ప్ర‌క‌టించింది. శ్రీకారం మూవీని వరంగల్ శ్రీను నైజాంలో పంపిణి చేస్తున్నారు. క్రాక్ మూవీ థియేటర్ల విషయంలో దిల్ రాజుకి, వరంగల్ శ్రీనుకి తేడా వచ్చిన సంగతి తెలిసిందే. మరలా ఒకే రోజు ఈ ఇద్దరి సినిమాలు రిలీజ్ కానుండటంతో ఏమవుతుందో అని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన పడుతున్నారు.

    Also Read: ‘శాకుంతలం’ స్పీడ్ పెంచిన గుణశేఖర్

    తండ్రి-కొడుకుల అనుబంధం నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో శ్రీ విష్ణుకి తండ్రిగా రాజేంద్ర ప్ర‌సాద్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు. అచ్చు రాజ‌మ‌ణి సంగీతం అందిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్