పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ అంతుచిక్కని వింత వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వింత వ్యాధి లక్షణాలతో తాజాగా దెందులూరు మండలం కొమిరేపల్లిలో ఒకరు మరణించారు. పశువుల మేత కోసుకొచ్చేందుకు పొలానికి వెళ్లిన రైతు ఏసుపాదం.. మూర్చరోగంతో కాలువలో పడి చనిపోయాడు. రైతు చనిపోయిన విషయాన్ని గమనించిన ఆ మార్గంలో పొలానికి వెళ్తున్న ఓ వ్యక్తి గ్రామస్తులకు సమచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యలు సదరు రైతు చనిపోయినట్లు నిర్దారించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్కారు ఆస్పత్రికి తరలించారు.
Also Read: ఎంజాయ్ చేస్తున్న ట్రంప్… వీడియో వైరల్..
ఈ అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో కొమిరేపల్లిలో గురువారం రాత్రి తొలి కేసు నమోదు కాగా.. శుక్రవారం 24 మంది వ్యాధి బారిన పడ్డారు. వీరిలో పురుషులు 16, మహిళలు 9 మంది ఉన్నారు. 21 మంది కోలుకున్నారు. నలుగురు చికిత్స పొందుతున్నారు. బాధితులందరిలో ఒకే లక్షణాలు కనిపిస్తున్నాయని, కళ్లు తిరగడం, మూర్చతో పడిపోవడం, నీరసంతో చతికిల పడడం, నోటి నుంచి నురగ రావడం వంటి లక్షణాలు కనిపించాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యలు అంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్