https://oktelugu.com/

జీమెయిల్ అకౌంట్ వాడుతున్నారా.. పాటించాల్సిన జాగ్రత్తలివే..?

దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు జీమెయిల్ ను వినియోగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులకు జీమెయిల్ తప్పనిసరిగా ఉండాల్సిందే. స్మార్ట్ ఫోన్లను వినియోగించాలంటే కూడా జీమెయిల్ లేదా మరో ఈ మెయిల్ కచ్చితంగా ఉండాలి. అయితే చాలామంది జీమెయిల్ యూజర్లు గూగుల్ తమ డేటాను సేవ్ చేసుకుంటుందని భావిస్తున్నారు. కొందరు యూజర్లు డేటాను సేవ్ చేసుకున్నా పెద్దగా పట్టించుకోరు. అయితే మరి కొందరు యూజర్లు మాత్రం డేటాను సేవ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే జీమెయిల్ యూజర్లు కొన్ని టిప్స్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 24, 2021 / 02:35 PM IST
    Follow us on

    దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు జీమెయిల్ ను వినియోగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులకు జీమెయిల్ తప్పనిసరిగా ఉండాల్సిందే. స్మార్ట్ ఫోన్లను వినియోగించాలంటే కూడా జీమెయిల్ లేదా మరో ఈ మెయిల్ కచ్చితంగా ఉండాలి. అయితే చాలామంది జీమెయిల్ యూజర్లు గూగుల్ తమ డేటాను సేవ్ చేసుకుంటుందని భావిస్తున్నారు. కొందరు యూజర్లు డేటాను సేవ్ చేసుకున్నా పెద్దగా పట్టించుకోరు.

    అయితే మరి కొందరు యూజర్లు మాత్రం డేటాను సేవ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే జీమెయిల్ యూజర్లు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా గూగుల్ డేటాను యాక్సెస్ చేయకుండా చేయడంతో పాటు గూగుల్ ఇప్పటివరకు స్టోర్ చేసిన డేటాను డిలేట్ చేసే అవకాశం ఉంటుంది. గూగుల్ సాధారణంగా జీమెయిల్ ద్వారా లొకేషన్, చాట్ హిస్టరీ, చూసిన యూట్యూబ్ వీడియోల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది.

    Also Read: యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సిగ్నల్ యాప్..?

    గూగుల్ స్టోర్ చేసిన డేటాను డిలేట్ చేయడం కోసం ఒక ప్రత్యేక డేటా టూల్ ను తీసుకొచ్చింది. ఈ యాక్టివిటీ డేటా టూల్ ను వినియోగించుకోవాలంటే google.com వెబ్ సైట్ లోకి వెళ్లి జీమెయిల్ అకౌంట్ లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తరువాత రైట్ టైప్ కార్నర్‏లో ఉన్న ఒక సర్కిల్ ఐకాన్ పై క్లిక్ చేసి data & personalization ఆప్షన్ కింద ఉన్న యాక్టివిటీ కంట్రోల్ ప్యానెల్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

    Also Read: గూగుల్ లో రోజంతా వాటిగురించే సెర్చింగ్…

    ఆ తరువాత మేనేజ్ యాక్టివిటీ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత డేటా యాక్టివిటీ సంబంధించిన జాబితాను డిలేట్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ డేటాను ట్రాక్ చేయకుండా ఉండాలంటే మాత్రం google.com వెబ్ సైట్ లో జీమెయిల్ తో లాగిన్ అయిన తరువాత manage your google account అనే ఆప్షన్ పై క్లిక్ చేసి data & personalization ఆప్షన్ ద్వారా యాక్టివిటీ కంట్రోల్ ప్యానెల్ ను సెలక్ట్ చేసుకోవాలి.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    అందులో కనిపించే ఆప్షన్స్ ను ఆఫ్ చేయడం ద్వారా సులభంగా డేటాను ట్రాక్ చేయకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా గూగుల్ మన డేటాను ట్రాక్ చేయకుండా చేయవచ్చు.