Homeఎంటర్టైన్మెంట్Sree Vishnu not becoming Top Hero: శ్రీ విష్ణు టాప్ హీరో గా మారకపోవడానికి...

Sree Vishnu not becoming Top Hero: శ్రీ విష్ణు టాప్ హీరో గా మారకపోవడానికి కారణం ఎవరు..? ఆయన్ని తొక్కేస్తున్నారా..?

Sree Vishnu not becoming Top Hero: సినిమా ఇండస్ట్రీకి సోలోగా వచ్చి రాణించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని… కొందరు మాత్రమే ఒక నిబద్ధతతో ముందుకు దూసుకెళ్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ స్టార్లుగా మారుతుంటారు. ఇక అలాంటి వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక ప్రస్తుతం శ్రీ విష్ణు సైతం ఇండస్ట్రీలో ఎలాంటి వారసత్వ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఆయన తీసిన సినిమాలు అతన్ని సక్సెస్ ఫుల్ హీరోగా నిలుపుతున్నాయి. కానీ ఆయన భారీ సక్సెస్ ను మాత్రం సాధించలేకపోతున్నాడు అతని సినిమాలు హిట్టుకే పరిమితం అవ్వడంతో చాలామంది అతన్ని చూసి అతను స్టార్ హీరో అవ్వాల్సిన వాడు కానీ తను మీడియం రేంజ్ హీరో గానే మిగిలిపోతున్నాడు కారణం ఏంటి అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అతన్ని ఎవరు తొక్కిస్తున్నారు అంటూ కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. నిజానికి శ్రీ విష్ణు ను ఎవరు తొక్కడం లేదు. ఆయనకైనా తొక్కేసుకుంటున్నాడు.

కారణం ఏంటి అంటే ఒక సినిమా చేసే క్రమంలో సినిమాకి సంబంధించిన మార్పులు చేర్పులు తనే చేస్తాడనే ఒక టాకైతే ఉంది. దానివల్ల సూపర్ సక్సెస్ గా నిలవాల్సిన ఆయన సినిమాలు ఎబో యావరేజ్ హిట్టు దగ్గరే ఆగిపోతున్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం.

Also Read: పవన్ కళ్యాణ్ చేసిన ఒక్క చిన్న సహాయాన్ని ఇప్పటికి మరచిపోని మహేష్ బాబు… ఏంటది..?

ఇక తన వైఖరి మార్చుకుంటే మాత్రం ఆయన టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ‘విష్ణు విన్యాసం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతుంది.

ప్రస్తుతం చిన్న దర్శకుడు చిన్న ప్రొడ్యూసర్లకు శ్రీ విష్ణు అందుబాటులో ఉంటూ వాళ్ళ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఇకమీదట కూడా ఇలాంటి సినిమాలను చేసి ఆయనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంటాడా? అలాగే టాప్ హీరోగా మారతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular