https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ ఇంట్లో ఎన్టీఆర్ బయోపిక్..సోషల్ మీడియా లో వివాదాస్పదంగా మారిన లేటెస్ట్ ఫోటో!

అభిమానితో దిగిన ఒక ఫొటోలో, అల్లు అర్జున్ వెనుక 'ఎన్టీఆర్ బయోపిక్' కి సంబంధించిన పుస్తకం ఒకటి ఉండడాన్ని అభిమానులు గమించారు. దీనిని చూసి మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ, జీవితాన్ని ఇచ్చిన చిరంజీవి గారి ఫోటో ఇంట్లో లేదు, కానీ ఎన్టీఆర్ ఫోటో మాత్రం ఉంది, కావాలని అల్లు అర్జున్ ఇదంతా చేస్తున్నాడా అంటూ పోస్టులు వేశారు

Written By:
  • Vicky
  • , Updated On : October 18, 2024 / 12:22 PM IST
    Follow us on

    Allu Arjun :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఈయనకి నార్త్ ఇండియా లో కూడా ‘పుష్ప’ సినిమాతో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన హీరో గా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ కోసం దేశం మొత్తం ఎంత ఆతృతగా ఎదురు చూస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డిసెంబర్ 6వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కి సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదల అవ్వగా, వాటికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ తన అభిమానులను ఎంతలా ప్రేమిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాళ్ళు చూపించే ప్రేమ గురించి ఎప్పటికప్పుడు ఎన్నో సందర్భాలలో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు.

    అయితే రీసెంట్ గానే ఉత్తర్ ప్రదేశ్ నుండి ఒక అల్లు అర్జున్ వీరాభిమాని, ఆయన్ని కలిసేందుకు 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అభిమాని రీసెంట్ గానే అల్లు అర్జున్ ని కలిసాడు. అభిమానితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన అల్లు అర్జున్, అతను తిరిగి వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్స్ వేయించాడు. అలాగే అతనికి ఎంతోకొంత డబ్బులు ఇచ్చి పంపండి అంటూ తన స్టాఫ్ ని ఆదేశించాడు. ‘పుష్ప 2: ది రూల్’ మూవీ ప్రొమోషన్స్ కోసం ఉత్తర్ ప్రదేశ్ కి వస్తానని, అప్పుడు కచ్చితంగా మళ్ళీ కలుస్తానని చెప్పుకొచ్చాడు. అయితే అభిమానితో దిగిన ఒక ఫొటోలో, అల్లు అర్జున్ వెనుక ‘ఎన్టీఆర్ బయోపిక్’ కి సంబంధించిన పుస్తకం ఒకటి ఉండడాన్ని అభిమానులు గమించారు. దీనిని చూసి మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ, జీవితాన్ని ఇచ్చిన చిరంజీవి గారి ఫోటో ఇంట్లో లేదు, కానీ ఎన్టీఆర్ ఫోటో మాత్రం ఉంది, కావాలని అల్లు అర్జున్ ఇదంతా చేస్తున్నాడా అంటూ పోస్టులు వేశారు. దీనికి అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది సోషల్ మీడియా లో స్పందిస్తూ ‘అల్లు అర్జున్ గారి ఇంట్లో లెజెండ్స్ కి సంబంధించిన ఫోటోలు ఉంటాయి.

    చిరంజీవి గారికి సంబంధించిన ఫోటో బిగ్ ఫ్రేమ్ చేయించి ఆఫీస్ టాప్ లో పెట్టించాడని, డ్యాన్స్ ఫ్లోర్ లో కూడా ఆయన ఫోటో ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు కాస్త సాథించారు. అల్లు అర్జున్ ని మెగా అభిమానులు అనేక సందర్భాలలో చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఆయన చాలా మంచివాడని, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని ఎంతో ప్రేమిస్తాడని, ప్రతీసారి దానిని నిరూపించుకోవాల్సిన అవసరం తనకి లేదని అల్లు అర్జున్ అభిమానులు చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమరావతి లో ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా పిలిచే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. వచ్చే నెలలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మూవీ టీం నుండి రాబోతుంది.