Squid Game Real Story: ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో చాలా మంది డబ్బే ప్రధానంగా బ్రతుకుతున్నారు. నిజానికి డబ్బు లేకపోతే మనం ఎందుకు పనికి రాము అనే డైలమా లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక రకంగా డబ్బు లేకపోతే ఏ పని జరగదు. మొత్తానికైతే మన జీవితాలన్నీ కాస్ట్లీ లైఫ్లుగా మారిపోయాయి. అందువల్లే ధనం మూలం ఇదం జగత్ అని చెబుతూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా డబ్బులు కోసం ప్రాణాలను సైతం తెగించి పోరాటం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు… ఇక డబ్బుల కోసం తమ ప్రాణాలను సైతం తెగించి కొంతమంది కొని గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలాంటి సిరీస్ పేరే స్క్విడ్ గేమ్(Squid Game). ఇక ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి చేసుకున్న స్క్విడ్ గేమ్ రెండు సీజన్లతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈరోజు నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘స్క్విడ్ గేమ్ 3’ స్ట్రీమింగ్ అవ్వబోతోం. ఈ క్రమంలో ఆ సిరీస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: కన్నప్ప’ మూవీ ట్విట్టర్ రివ్యూ..సెకండ్ హాఫ్ ఆ రేంజ్ లో ఉందా..చప్పుడు లేదుగా!
జీవితంలో అన్నీ కోల్పోయి అప్పలపాలైన 456 మంది ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉంటారు అలాంటి టైం లో వాళ్ళను ఒక దీవి లోకి తీసుకెళ్లి అక్కడ ప్రాణాంతకమైన ఆటలు ఆడిపించి చాలామంది ప్రాణాలు పోయేలా వాటిని ఆడిస్తూ ఉంటారు. ఈ గేమ్ లో ఓడిపోతే చనిపోవడం తప్ప మరో మార్గం లేదు అనేలా ఆ గేమ్ ను డిజైన్ చేసి ఆ ఆటల ద్వారా కూడా మనిషి ప్రాణాలను తీస్తూ అదో రకమైన ఎంజాయ్మెంట్ పొందొచ్చు అనుకునే టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటారు…
ఇక ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ పాత్ర పోషించిన నెంబర్ 456 జి హున్ పాత్ర నిజ జీవితంలోనిదే. స్క్విడ్ గేమ్ దర్శకుడు ‘డాంగ్ హ్యూక్’ కు తన జీవితంలోను ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కొద్ది సంవత్సరాలు ఆయన ఒక కంపెనీలో జాబ్ చేశాడట. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే కంపెనీతో విబేధాలు రావడం తో అక్కడున్న ఇతర ఉద్యోగులతో కలిసి ధర్నా చేశాడట. దాంతో అతని జాబును కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఇలాంటి సమయంలో ఆయన ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎలా నిలబడ్డాడు అనేది ఇందులో చూపించడం జరిగింది…
స్క్విడ్ గేమ్ స్క్రిప్ట్ పట్టుకుని దర్శకుడు దాదాపు ఒక పది నుంచి 12 సంవత్సరాల పాటు ఇతర ప్రొడక్షన్ హౌజ్ ల చుట్టూ తిరిగాడట. అయినప్పటికి అతనికి ఒక్క అవకాశాన్ని కూడా ఎవరు ఇవ్వలేకపోయారు. ఫైనల్ గా వచ్చిన అవకాశాన్ని వాడుకొని ఆయన సూపర్ డూపర్ సక్సెస్ ని తెరకెక్కించడం అనేది అతనికి నిజంగా చాలా అచీవ్మెంట్ అని చెబుతూ ఉంటాడు…
గేమ్ లో చూపించిన దివి నిజంగానే ఉంది… దీనిని బ్రదర్స్ హోమ్ గా పిలుస్తూ ఉంటారు…
ఇక గేమ్ లోకి ఎంటర్ అవ్వడానికి కావాల్సిన ఫోన్ నెంబర్ దక్షిణ కొరియాలో నిజంగానే ఉందట. ఈ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఫోన్ నెంబర్ కి చాలా ఫోన్ కాల్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తున్నాయి…
స్క్విడ్ గేమ్ సీజన్ వన్ లో ఇచ్చిన పాకిస్తానీ నటుడు అనుపమ్ త్రిపాఠి భారతీయ సంతతికి చెందిన వాడే కావడం విశేషం. ఆయన కొరియన్ లాంగ్వేజ్ లో కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు…
ఇక దక్షిణ కొరియాలో పేదవాళ్లకు ధనికులకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని, వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఈ సిరీస్ లో చూపించే ప్రయత్నం చేశారు…
ఇక రెడ్ లైట్, గ్రీన్ లైట్ పేరుతో అన్నీ తెలిసిన వ్యక్తి అలా అన్ని క్లియర్ చేస్తూ నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్తూ ఉంటాడు ఆ బొమ్మ కూడా అతన్ని స్కాన్ చేయదు.
మొదటి గేమ్ పూర్తయిన తర్వాత చాలా మంది చనిపోతారు. అప్పుడు ప్లేయర్ నెంబర్ 119 మాట్లాడుతూ ఇలా డబ్బు ఆశ చూపించు మనుషులను తీసుకొచ్చి చంపడం చాలా అన్యాయం. మిమ్మల్ని పోలీసులు వదిలిపెట్టరు అంటూ కొన్ని మాటలు అయితే చెబుతూ ఉంటాడు. దక్షిణ కొరియాలో అత్యవసర పోలీసుల నెంబర్ అయినా 119 కి కాల్ చేస్తాడు…
ఈ సిరీస్ విడుదలైన ఏడాది నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక మంది చూసిన కొరియన్ డ్రామా సిరీస్ గా ఇది పలు రికార్డ్ లను క్రియేట్ చేసింది…ఇక ఇప్పుడు వచ్చిన సీజన్ 3 ఎలాంటి రికార్డు లు బ్రేక్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే…