Homeవార్త విశ్లేషణVellore Cow Attack: ఏంటా పగ.. ఎంతమంది ఆపినా వ్యక్తిని టార్గెట్ చేసి మరీ చంపిన...

Vellore Cow Attack: ఏంటా పగ.. ఎంతమంది ఆపినా వ్యక్తిని టార్గెట్ చేసి మరీ చంపిన ఆవులు.. షాకింగ్ వీడియో

Vellore Cow Attack: వేలూరు నగరంలో దారుణం చోటుచేసుకుంది. వేలూరు బస్టాండ్ సమీపంలోని లక్ష్మీ కేఫ్ వద్ద ఆవులు దాడి చేయడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై ఆవులు ఒక్కసారిగా దాడికి పాల్పడటంతో ఈ అనూహ్య ఘటన జరిగింది. దాడిలో గాయపడిన వారిని వెంటనే వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version