Kannappa Movie Twitter Review: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. మొదటి నుండి ఈ సినిమా మీద జనాల్లో నెగిటివ్ అభిప్రాయం ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్స్ ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టారో, అప్పటి నుండి కాస్త పాజిటివిటీ ప్రారంభమైంది. అది కూడా పూర్తి స్థాయిలో కాదు అనుకోండి. టీజర్ విడుదలైనప్పుడు మంచు విష్ణు పలికిన ‘శివయ్యా’ డైలాగ్ బాగా ట్రోల్ అయ్యింది. కొన్ని సినిమాల్లో కూడా ఈ ట్రోల్ ని వాడుకున్నారు. కానీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల అయ్యాక ఈ సినిమా మీదున్న అభిప్రాయం మొత్తం మారిపోయింది. ఆశ్చర్యం గా ఉందే,సినిమాలో విషయం ఉన్నట్టు ఉంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. ఇకపోతే రెండు రోజుల క్రితమే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు.
Looks like everyone came to watch only for Prabhas..!! Just go to 2nd half directly.. rating 1.75/5 #Kannappa https://t.co/ciS1uqlE27
— Peter Reviews (@urstrulyPeter) June 26, 2025
ఈ అడ్వాన్స్ బుకింగ్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. గడిచిన 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి 74 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మంచు విష్ణు గత 5 సినిమాలకు అమ్ముడుపోయిన టికెట్స్ ని కలుపుకొని చూసినా ఇన్ని టికెట్స్ తెగి ఉండవు. ఇదంతా పక్కన పెడితే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి. చాలా మంది ప్రముఖ రివ్యూయర్స్ ‘షో టైం’ అని ఒక ట్వీట్ వేసి కనిపించకుండా పొయ్యారు. కొంతమంది ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ ఇచ్చారు కానీ, సెకండ్ హాఫ్ రిపోర్ట్ ఇవ్వలేదు. ‘సినిమాకు వెళ్లినోళ్లు ఎటు పోయినారు రా..థియేటర్ లోనే నిద్ర పోయారా..లేపండి రా ఎవరైనా’ అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం పూర్తి స్థాయి రివ్యూ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన రివ్యూ ప్రకారం చూస్తే ఫస్ట్ హాఫ్ చాలా యావరేజ్ గా ఉందని అంటున్నారు.
First half nothing – 1/5. second half 3/5
Vayilungam fight,Prabhas (don’t even expect one worthy shot from Prabhas) poor vfx when Prabhas in frame .But Prabhas dialogues changed the story.From then last 20 mins Vishnu rocked anthe #Kannappa #prabhas
2.75/5 One time watch— Darlingseyyy (@Rebelwoodonlyy) June 27, 2025
ఫస్ట్ హాఫ్ మొత్తం తిన్నడు క్యారక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికే డైరెక్టర్ ఎక్కువ సమయం తీసుకున్నాడు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ లవ్ సన్నివేశాలు అవసరమా అనిపించిందట. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ తిన్నడు ప్రయాణం చూపించాడట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఎప్పుడైతే ప్రభాస్(Rebel Star Prabhas) ఈ సినిమాలోకి ఎంట్రీ ఇస్తాడో , అప్పటి నుండి స్క్రీన్ ప్లే పరుగులు పెట్టిందట. ప్రభాస్ సన్నివేశాల వరకు టికెట్ కొని థియేటర్స్ కి వెళ్లిన ఆడియన్స్ కి న్యాయం జరిగిన ఫీలింగ్ కలుగుతుందట. ఇక చివరి 15 నిమిషాలు అయితే మంచు విష్ణు తన అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాడట. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ హాఫ్ ఒక్కటి భరిస్తే సెకండ్ హాఫ్ ని చూసేయొచ్చు అని అంటున్నారు. కొంతమంది అయితే నేరుగా సెకండ్ హాఫ్ నుండి ఈ సినిమాకు వెళ్ళండి అని అంటున్నారు.
#Kannappa Review :
1st half bgm and some sence are worth migtha motham dolaa…
2nd half lo last 15 to 20 min acting of @iVishnuManchu
anna kuta ramp u asaluu screen presence mind-blowing
And second half lo #Prabhas entry and screen presence worth movie pic.twitter.com/UE92yRzRNh— Scott Lopez (@ScottLo94848063) June 27, 2025
Positive Reports For #Kannappa
ముఖ్యంగా రెండవ భాగం బాగుంది
అని ముందస్తు గా సినిమా చూసిన వాళ్ళు
చెపుతున్నారు,
కాసేపు ఆగి నేను చూస్తాను#KannappaReview #Kannappa27thJune pic.twitter.com/cuEGHvuFkL— Kakinada Talkies (@Kkdtalkies) June 27, 2025
#Kannappa super ga undhi movie
Excellent bgm , anni cameos kuda thop level elevations tho unnayi
Main ga prabhas character
Manchu vishnu character aithe peaks lo rasaru , Manchi vishnu as Tinnadu aithe jeevinchesadu
Hit kottesav anna @iVishnuManchu— Ajith (@TanjiroKamarao1) June 27, 2025