Spirit : ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ సపరేటు ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు సైతం చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి భారీ క్రేజ్ ను సంపాదించుకొని తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు… ఇక మీదట ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు…అందుకే ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే చేస్తున్నాడు…
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga) ఆయన చేస్తున్న ప్రతి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేయడంలో కూడా చాలా వరకు కీలకపాత్ర వహిస్తూన్నారు. ఇక ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలను భారీ బడ్జెట్ తో చేయడమే కాకుండా ప్రేక్షకులందరిలో ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధించబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక సందీప్ రెడ్డి వంగ గతంలో అర్జున్ రెడ్డి, అనిమల్ లాంటి రెండు సినిమాలను చేశాడు. కాబట్టి ఆయన ఆ రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇప్పుడు చేయబోతున్న సినిమాతో కూడా భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : స్పిరిట్ సినిమాలో ప్రభాస్ అన్న గా నటిస్తున్న స్టార్ హీరో…
అయితే ఈ సినిమా హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారనే విషయం మీదనే సరైన క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నప్పటికి సందీప్ మాత్రం ఇంకా ఎవరిని ఫైనల్ చేసినట్టుగా కనిపించడం లేదు. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించడానికి స్కోప్ ఉందట.
మరి ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసి పెట్టాడు. ఇక హీరోయిన్ల ఎంపిక జరిగితే సినిమాను సెట్స్ మీదకి కూడా తీసుకెళ్లే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ప్రభాస్ ఫౌజీ (Fouji) సినిమాని ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు ఈ సినిమా కోసం ఎప్పుడు డేట్స్ ఇస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం ప్రభాస్ ఇటు మారుతితో రాజసాబ్, అటు హను తో ఫౌజీ రెండు సినిమాలను కూడా శరవేగంగా పూర్తి చేసి ఈ రెండింటిని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read : స్పిరిట్ కోసం ప్రభాస్ బాడీ మీద ఆ టాటు వేయిస్తున్న సందీప్ రెడ్డి వంగ…