Spirit: సినిమా అంటే చాలు ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళ సినిమాలను చూడడానికే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తద్వారా వాళ్ల సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడమే కాకుండా ఇండస్ట్రీలో వాళ్ళు నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతూ ఉంటారు. ఇక వెనకాల ఉండి సినిమాను నడిపించే దర్శకులు మాత్రం ఎవరికీ గుర్తుకురారు…
అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డివంగ(Sandeep Reddy Vanga)…ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ ని సైతం చాలా ఎక్కువగా కష్టపెట్టాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు తను చేసిన సినిమాల కంటే కూడా ఇది భిన్నంగా ఉంటుందని ప్రభాస్ లోని డైలాగ్ డెలివరీ గాని తన మాడ్యులేషన్స్ గాని యాక్టివిటీస్ గాని అన్ని డిఫరెంట్ వేలో ఉంటాయని సందీప్ రెడ్డివంగ తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం ప్రభాస్ బాడీ మీద కొన్ని టాటూస్ ని కూడా వేయిస్తున్నాడట. మరి ఆ టాటూస్ కి సినిమాకి చాలా దగ్గర సంబంధం ఉంటుందని సినిమాలో ఉన్న కొన్ని క్లూ పాయింట్లని తన టాటూ ద్వారా ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన 5 ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీ
మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. మరి ప్రభాస్ తో సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారీ రేంజ్ లో అంచనాలు ఉండడమే కాకుండా పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలవబోతుంనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రభాస్ లాంటి నటుడు దొరికితే ప్రతి ఒక్క దర్శకుడు సైతం ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే చూస్తుంటారు సందీప్ రెడ్డివంగా కూడా దానికి మినహాయింపు ఏం కాదు. ఈ సినిమాతో 2000 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ గా మలుస్తు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక తన చేసిన సినిమాలన్నీ బోల్డ్ కంటెంట్ తో ఉన్నప్పటికి అందులో ఒక మంచి ప్రేమ కథ అయితే ఉంటుంది. మరి చేయబోతున్న సినిమా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథతో వస్తుంది. కాబట్టి ఈ సినిమాలో బోల్డ్ సీన్లు కొంతవరకు తగ్గే అవకాశమైతే ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read: సలార్ 2 లో పృధ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ చనిపోతుందా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్…