Prashanth Neel : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే భారీ గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగ (సందీప్ Reddy Vanga) ఒకరు. అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత రన్బీర్ కపూర్ (Ranaberr kapoor) ను హీరోగా పెట్టి చేసిన అనిమల్ (Animal) సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి దృష్టి సందీప్ రెడ్డి వంగ మీదకి మళ్ళించుకునేలా చేశాడు. సందీప్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల మీద భారీ దృష్టిని పెట్టి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికి రెండు వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టాలనే ఉద్దేశ్యంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసించే స్థాయికి తను ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి అంటూ ఆయన ఓపెన్ గా చెబుతున్నాడు… ఇక కే జి ఎఫ్ (KGF) సినిమాతో పాన్ ఇండియా సినిమాలు చేసి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్… ప్రభాస్ తో సలార్ (Salaar) సినిమా చేసి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సందీప్ రెడ్డివంగ ప్రశాంత్ నీల్ మధ్య భారీ పోటీ అయితే ఉంది.
Also Read : ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ కత్తి పట్టబోతున్నాడా..?
వీళ్ళిద్దరి సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన లభిస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరూ భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. మరి స్టార్ హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయడానికి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అందువల్లే వీళ్ళ సినిమాలను ప్రేక్షకులు మనకు ఈజీగా అర్థమవుతుంది…
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న ఈ స్టార్ డైరెక్టర్లు తమను తాము స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక వీళ్ళిద్దరికి సపరేట్ స్టైల్ ఉండడం వల్ల వీళ్ళిద్దరి సినిమాలు చాలా ఫ్రెష్ గా ఉండడమే కాకుండా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ డైరెక్టర్ గా ఎదుగుతారు…ఎవరు ఇండియాని శాసించే స్థాయికి వెళ్తారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : ప్రశాంత్ నీల్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? ఆయన వల్ల ప్రశాంత్ కెరియర్ మారిపోయిందిగా…