SRH Vs KKR: ప్రస్తుత ఐపీఎల్(IPL) సీజన్లో ట్రోఫీ దక్కించుకునే సత్తా ఉన్న జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఒకటి. హెడ్(Travis Head), క్లాసెన్(Klassen), నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy), అభిషేక్ శర్మ(Abhishek Sharma), అనికేత్ వర్మ(Aniket Verma) వంటి వారితో బ్యాటింగ్ బలంగా ఉంది.
Also Read: కిస్సింగ్ స్టార్ మళ్లీ మొదలుపెట్టాడు.. ముద్దు కూడా ఇచ్చాడు..
కానీ అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టుగా.. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడి.. 286 పరుగులు సాధించి విజయ దక్కించుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయింది.. తద్వారా పాయింట్లు పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది.. దీంతో హైదరాబాద్ అసలు ఈసారి ట్రోఫీ గెలుస్తుందా.. గత సీజన్ లో ఫైనల్ వెళ్ళిన జట్టు.. ఈసారి కనీసం గ్రూప్ దశ అయినా దాటుతుందా.. అనే అనుమానాలు సగటు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానిలో కలుగుతున్నాయి.. బౌలింగ్ లో పస లేకపోవడం.. బ్యాటింగ్లో సత్తా లేకపోవడం.. ఫీల్డింగ్ సామర్థ్యం లేకపోవడంతో హైదరాబాద్ జట్టు మీద అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. గత సీజన్లో ఫైనల్ వెళ్లిన జట్టు.. ఇలా ఆడుతోంది ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దారుణమైన ఓటములు
గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్ కతా చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ 80 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడిపోయింది.. ఐపీఎల్ హైదరాబాద్ కు ఇదే అతిపెద్ద భారీ ఓటమి..
2024లో చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 77 పరుగుల తేడాతో ఓడిపోయింది.
2013లో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 77 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓటమిపాలైంది.
2014లో షార్జా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు చేతిలో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇక హైదరాబాద్ జట్టుపై వరుసగా ఐదు విజయాలు సాధించిన జట్ల జాబితాలో కోల్ కతా నైట్ రైడర్స్ చేరింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై తిరుగులేని రికార్డులను నెలకొల్పింది. బహుశా హైదరాబాద్ ఇప్పట్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై పై చేయి సాధించే అవకాశం లేదని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
2020 నుంచి 23 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా హైదరాబాద్ జట్టుపై ఐదు విజయాలు సాధించింది.
2023 నుంచి 25 సీజన్లో ఇప్పటివరకు కోల్ కతా నైట్ రైడర్స్ వరుసగా ఐదు విజయాలు సాధించింది.
2018లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగు విజయాలు సాధించింది.
2020 -21 సీజన్ వరకు కోల్ కతా నైట్ రైడర్స్ వరుసగా నాలుగు విజయాలు సాధించింది. అంతేకాదు సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్ కతా నైట్ రైడర్స్ తన విజయాల సంఖ్యను 20 కి పెంచుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అభిమానులు హైదరాబాద్ ఆటగాళ్లపై మండిపడుతున్నారు.