Spirit Movie Sensational Update: షూటింగ్ మొదలు కాకముందే ఒక సినిమా పై కనీవినీ ఎరుగని అంచనాలు మనం ఇది వరకు కేవలం రాజమౌళి(SS Rajamouli) సినిమాలకు మాత్రమే చూసాము. ఆ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ’ చిత్రానికి చూసాము. ఇప్పుడు అదే రేంజ్ క్రేజ్ ని ప్రభాస్ ‘స్పిరిట్'(Spirit Movie) చిత్రానికి చూస్తున్నాము. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) ఈ చిత్రాన్ని ప్రకటించిన రోజు నుండే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్లాయి. కానీ షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో అసలు ఈ ఏడాది ఈ సినిమా మొదలు అవుతుందా?, వచ్చే ఏడాది లో ప్రారంభం అవుతుందా? , అసలు ఈ సినిమా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే ప్రభాస్(Rebel Star Prabhas) కి ఒకే సమయంలో రెండు మూడు సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం అలవాటు. కానీ ‘స్పిరిట్’ చిత్రానికి సందీప్ వంగ ఆ అవకాశం ఇవ్వలేదు.
Also Read: ‘డీజే టిల్లు’ కాంబినేషన్ ని రిపీట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ.. ఈసారైనా అదృష్టం కలిసి వస్తుందా?
తనకు నాన్ స్టాప్ గా 45 రోజుల డేట్స్ కావాలని, సమాంతరంగా మరో సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి వీలు లేదని ప్రభాస్ తో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు. అందుకే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇన్ని రోజులు పట్టింది . ఈ గ్యాప్ లో సందీప్ వంగ స్క్రిప్ట్ ని మరింత సానబెట్టాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో పూర్తిగా నిమగ్నమయ్యాడు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి స్టేజి కి వచ్చింది. ఈ సినిమాలో నటించబోయే నటీనటలను కూడా ఖరారు చేసేసాడు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం దీపికా పదుకొనే ని సంప్రదించారు. ఆమె నటించడానికి ఒప్పుకుంది కానీ, రెమ్యూనరేషన్ విషయం లో , షూటింగ్ డేట్స్ విషయం లో ఎన్నో కండీషన్స్ పెట్టింది. దీంతో ఈ ఆమెని ఈ సినిమా నుండి మొహమాటం లేకుండా తప్పించి యానిమల్ లో సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి దిమిరి ని ఎంచుకున్నాడు.
Also Read: మొండికేస్తున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత AM రత్నం.. ఇలా అయితే ఈసారి కూడా కష్టమే!
తనని కాదని చిన్న హీరోయిన్ ని తీసుకున్నందుకు దీపికా పదుకొనే తన పీఆర్ టీం తో సినిమా పై నెగెటివ్ ప్రచారం చేయడం తో సందీప్ వంగ ఫైర్ అవుతూ ఒక ట్వీట్ కూడా చేశాడు. ఆ ట్వీట్ పెద్ద సంచలనంగా మారింది. ఇలా షూటింగ్ కి వెళ్లే ముందే ఇన్ని జరిగాయి అన్నమాట. అయితే ఎట్టకేలకు త్వరలోనే సందీప్ వంగ అధికారికంగా అభిమానులకు ఒక శుభవార్త చెప్పబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ని ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుండి మొదలు పెట్టబోతున్నారట. అందుకు సంబందించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యాయని టాక్. అంటే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ మూవీ షూటింగ్స్ పూర్తి అవ్వబోతున్నాయి అన్నమాట. అంటే న్యూ ఇయర్ నుండి ‘స్పిరిట్’ మూవీ అప్డేట్స్ తో సోషల్ మీడియా మొత్తం ఒక రేంజ్ లో ఊగిపోబోతుంది అన్నమాట.