AM Ratnam Sensational Decision: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). నిన్న మొన్నటి వరకు ఈ సినిమా పై చాలా చిన్న చూపు, తక్కువ అంచనాలు ఉండేవి కానీ, మొన్న ట్రైలర్ విడుదల తర్వాత నుండి మాత్రం ఈ సినిమా రేంజ్ ఏంటో అందరికీ అర్థమైంది. సినిమాలకు దూరమై వేరే వ్యాపారాల్లో బిజీ గా ఉండే AM రత్నం నుండి ఇంత పెద్ద భారీ బడ్జెట్ చిత్రమా ?, రాజకీయాల్లో ఊపిరి కూడా పీల్చుకోలేనంత బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద భారీ సినిమాలో ఎలా నటించగలిగాడు అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇంతకు ముందు AM రత్నం(AM Ratnam) బయ్యర్స్ కి చెప్పిన రేట్స్ కి, ప్రస్తుతం జరుగుతున్న బిజినెస్ చర్చలకు మధ్య చాలా తేడా ఉంది. ట్రైలర్ తర్వాత నిర్మాత AM రత్నం కి బయ్యర్స్ నుండి నాన్ స్టాప్ కాల్స్ వస్తూనే ఉన్నాయి.
Also Read: ‘డీజే టిల్లు’ కాంబినేషన్ ని రిపీట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ.. ఈసారైనా అదృష్టం కలిసి వస్తుందా?
కానీ ఆయన ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సెంటర్ లో కూడా బిజినెస్ ని క్లోజ్ చేయలేదు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లా 11 కోట్ల రూపాయలకు దాదాపుగా ఒప్పేసుకున్నాడు. కానీ మరో డిస్ట్రిబ్యూటర్ తో ఆయన 14 కోట్ల రూపాయిల ఆఫర్ ని ఆశిస్తున్నాడు. ప్రతీ సెంటర్ లోనూ ఇదే చేస్తున్నాడు. సీడెడ్ లో 27 కోట్ల రూపాయలకు అసలు తగ్గడం లేదు. ఇప్పటి వరకు బాహుబలి 2 , #RRR , పుష్ప 2 చిత్రాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద 27 కోట్ల షేర్ మార్కుని దాటాయి. చాలా అరుదుగా జరిగే మ్యాజిక్స్ అవి. అలాంటిది 27 కోట్ల రూపాయిలను డిమాండ్ చేస్తున్నాడు. అంతకు మించి అసలు తగ్గడం లేదు. 20 నుండి 23 కోట్ల రూపాయిల మధ్యలో అమ్ముతాను అంటే కొనేందుకు ఎంతో మంది బయ్యర్స్ సిద్ధంగా ఉన్నారు. కానీ AM రత్నం దిగడం లేదు.
Also Read: ప్రశాంత్ నీల్ తో సినిమా చేయకుండా ఆయన్ని అవమానించిన స్టార్ హీరో…
ప్రతీ సెంటర్ లోనూ ఇంతకు ముందు బయ్యర్స్ ఇస్తామన్న దానికంటే 30 శాతం ఎక్కువ ఇస్తామని ముందుకు వచ్చారు. కానీ AM రత్నం మాత్రం ఇంకా ఎక్కువ ఆశిస్తున్నాడు. ఆ ట్రైలర్ ని చూపించి పుష్ప 2 రేంజ్ థియేట్రికల్ రైట్స్ ని ఆశిస్తున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండి 170 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ చెయ్యాలని చూస్తున్నాడు. AM రత్నం ఒక్క మెట్టు క్రిందకు దిగకుండా,ఇలాగే చేస్తూ పోతే ఈ చిత్రం వ్యాపారం అంత తేలికగా క్లోజ్ అవ్వదు. విడుదలకు మరో వారం రోజుల గ్యాప్ ఉన్నప్పుడు కూడా బిజినెస్ పూర్తి అవ్వదు. అప్పుడు మళ్ళీ సినిమా వాయిదా వేయాల్సి వస్తుంది. ఇదే భయం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా ఉంది. మరి నిర్మాత రత్నం ఏమి చేస్తాడో చూడాలి.