DJ Tillu combination repeat: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోల లిస్ట్ తీస్తే అందులో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) కూడా కచ్చితంగా ఉంటాడు. ఇతను ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఉన్నాడు, కెరీర్ ప్రారంభం లో సైడ్ క్యారక్టర్ రోల్స్ చాలానే చేశాడు, ‘గుంటూరు టాకీస్’ చిత్రం తో మొట్టమొదటిసారి హీరోగా మారాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ చేశాడు కానీ, తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపుని తీసుకొచ్చిన చిత్రం మాత్రం ‘డీజే టిల్లు’ నే. ఈ సినిమాతోనే సిద్దు ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ఆయన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసాడు. కానీ రీసెంట్ గా ఈయన నుండి విడుదలైన ‘జాక్’ చిత్రం మాత్రం కమర్షియల్ గా భారీ నుండి అతి భారీ డిజాస్టర్ గా నిల్చింది.
దీంతో సిద్దు జొన్నలగడ్డ తాను తీసుకున్న రెమ్యూనరేషన్ లో సగం తిరిగి నిర్మాతలకు ఇచ్చేసాడు. అయితే జాక్ విషయం లో సిద్దు ఎన్నో విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాకు పేరుకి మాత్రమే డైరెక్టర్ గా బొమ్మరిల్లు భాస్కర్ కొనసాగాడు. కానీ స్క్రిప్ట్ వేలెట్టి, డైరెక్టర్ తో కొట్లాడి, అనేక సన్నివేశాలను తన ఇష్టానికి తగ్గట్టుగా డైరెక్ట్ చేయించుకున్నని సిద్దు అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పాడు కూడా. దీంతో క్రిటిక్స్ సిద్దు ని తప్పుబట్టడం మొదలు పెట్టారు. కేవలం అతని వల్లే ఈ సినిమా ఇంత ఫ్లాప్ అయ్యింది అంటూ నిందించారు. ఈ జాక్ ఫ్లాప్ నుండి సిద్దు జొన్నలగడ్డ అంత తేలికగా ఇప్పట్లో బయటపడ్డాడు అని అంతా అనుకున్నారు. కానీ మళ్ళీ భారీ కం బ్యాక్ ఇచ్చేందుకు ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ‘డీజే టిల్లు'(Dj tillu Movie) చిత్రానికి దర్శకత్వం వహించిన రవికాంత్ పేరెపు(Ravikanth Perepu) తో మరోసారి చేతులు కలపబోతున్నాడు సిద్దు జొన్నలగడ్డ.
Also Read: ప్రశాంత్ నీల్ తో సినిమా చేయకుండా ఆయన్ని అవమానించిన స్టార్ హీరో…
టిల్లు సిరీస్ కి నిర్మాతగా వ్యవహరించిన నాగవంశీ నే ఈ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. అయితే డీజే టిల్లు షూటింగ్ సమయంలో అత్యధిక శాతం దర్శకత్వ పర్యవేక్షణ, స్క్రిప్ట్, డైలాగ్స్ ఇలా అన్ని కూడా సిద్దు జొన్నలగడ్డ నే చేశాడు. అంతే కాదు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రవికాంత్ కి సిద్దు జొన్నలగడ్డ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందని, అందుకే టిల్లు స్క్వేర్ కి అతన్ని తప్పించి కళ్యాణ్ కృష్ణ ని తీసుకున్నారని ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉంది. మరి ఇప్పుడు అదే డైరెక్టర్ తో పని చేయబోతున్నాడు. ఈసారైనా క్రిటెటివ్ డిఫరెన్స్ తెచ్చుకోకుండా అతనితో పని చేస్తాడా లేదా అనేది చూడాలి. జాక్ నుండి పాఠాలు నేర్చుకుంటాడా?, లేకపోతే ఎప్పటి లాగానే కొనసాగుతాడా అనేది చూడాలి.
#BADASS – A film About ‘The World of Cinema and A Cinema Star’… pic.twitter.com/mN01ext8fM
— Aakashavaani (@TheAakashavaani) July 6, 2025