Spirit Movie: ప్రస్తుతం సందీప్ రెడ్డివంగ ఏది చేసినా సంచలనగా నిలుస్తోంది. ఇక రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మతో కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్న సందీప్ రెడ్డి వంగ తన సినిమాల విషయంలో మాత్రం ఎలాంటి అప్డేట్ ను ఇవ్వడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ మీదకి వెళ్తోంది. తను అనుకుంటున్నట్టుగానే ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తోందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే సందీప్ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్ళినా కూడా ఈ సినిమాను ఒక రా కంటెంట్ తో తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. తన సినిమాలో ఉన్నట్టుగానే బోల్డ్ కంటెంట్ సైతం ఈ సినిమాలో ఉండబోతుందట. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాను తను అనుకున్నట్టుగా తెరకెక్కిస్తే మాత్రం సినిమా భారీ రికార్డులను కొల్లగొట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మరొకసారి బ్రేక్ చేసి భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టి పలు రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
Also Read: ఎన్టీఆర్ కెరియర్ ను మార్చేసిన ముగ్గురు డైరెక్టర్స్ వీళ్ళేనా..?
ఈ సినిమాలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అంటే ఇప్పటివరకు ప్రభాస్ ఏ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపించలేదు. కానీ మొదటిసారి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాకి త్రివిక్రమ్ కొడుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం విశేషం… అలాగే మాస్ మహారాజా రవితేజ కొడుకు కూడా ఈ సినిమాకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ పని నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక వీళ్లిద్దరు సందీప్ దగ్గర వర్క్ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే ఆయనకి ఒక యూనిక్ స్టైల్ ఉంది. కాబట్టి దాన్ని క్యాప్చర్ చేయడానికి వాళ్ళు సందీప్ దగ్గర జైన్ అవుతున్నారు…అందుకే వీళ్లిద్దరు సందీప్ రెడ్డి వంగ శిష్యులుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళని సందీప్ ఎలా మౌల్డ్ చేస్తాడు. వాళ్ళు ఎలాంటి ఐడెంటిటిని సంపాదించుకుంటారు.
అలాగే వాళ్ళు ఈ సినిమాలతో గొప్ప గుర్తింపు సంపాదించుకోగలుగుతారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే అటు త్రివిక్రమ్, ఇటు రవితేజ ఇద్దరికి కూడా సందీప్ రెడ్డివంగా చాలా దగ్గరవుతాడు. ఎందుకంటే వాళ్ళ కొడుకులు తన సినిమాలకు వర్క్ చేశారు. కాబట్టి వాళ్లకి కూడా గొప్ప పేరు వస్తోంది. అందుకే ఇన్ డైరెక్ట్ గా వీళ్ళందరికి సందీప్ రెడ్డి వంగ దగ్గర అవుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…