Spider Man Across The Spider Verse: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్, ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన ZEE5లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే విషయాన్ని ZEE 5 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఈరోజు తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ఈ చిత్రం ఆగస్ట్ 8, 2023 నుండి ప్లాట్‌ఫారమ్‌లో సినిమా వీక్షకుల కోసం అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.
మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి కొలంబియా పిక్చర్స్, సోనీ పిక్చర్స్ యానిమేషన్ నిర్మించిన ఈ చిత్రం ఈ సంవత్సరం జూన్ లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా లో షమీక్ మూర్, హైలీ స్టెయిన్‌ఫెల్డ్, బ్రియాన్ టైరీ హెన్రీ, లూనా లారెన్ వెలెజ్, జేక్ జాన్సన్, జాసన్ స్క్వార్ట్జ్‌మాన్, ఇసా షీహమ్, డబ్ల్యు కరన్ సోగ్‌హమ్, గ్రెటా లీ, డేనియల్ కలుయుయా, మహర్షలా అలీ, ఆస్కార్ ఐజాక్ లాంటివారు ముఖ్యమైన పాత్రలలో కనిపించారు.
ఈ సంవత్సరం IPLలో అద్భుతమైన విక్టరీ సాధించిన క్రికెటర్ శుభ్‌మాన్ గిల్, స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్, హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో పవిత్ర్ ప్రభాకర్ పాత్రకి తన గాత్రాన్ని అందించారు. ఈ సినిమా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ ఇప్పటి వరకు సోనీ నిర్మించిన సినిమాలకు అత్యధిక వసూళ్లు చేసిన యానిమేషన్ విడుదలగా నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రం యానిమేషన్ ఫిల్మ్ సిరీస్ తొలి చిత్రం ‘స్పైడర్ మ్యాన్: ఇంటు ది స్పైడర్-వెర్స్’ యొక్క మొత్తం బాక్సాఫీస్ ఆదాయాలను కూడా అధిగమించింది. ఇప్పటి వరకు ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 680 మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఈ సినిమా.
స్పైడర్-మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ విమర్శకుల నుండి అలానే ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ZEE5లో ప్రసారం కావటానికి సిద్ధంగా ఉండడంతో, 190+ దేశాల్లోని వీక్షకులకు అందుబాటులో ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమాని థియేటర్స్ లో చూడని వారు హ్యాపీగా ఓటీటీలు చూసి ఎంజాయ్ చేయండి.