Bhola Shankar: పవన్ స్టార్ట్ చేస్తే చిరంజీవి ముగించాడు… భోళా శంకర్ వెనుకున్న ఈ ట్విస్ట్ తెలుసా!

పవన్ కళ్యాణ్ చేద్దామనుకున్న వేదాళం రీమేక్ అటు ఇటు తిరిగి చివరికి మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు రావడం, మెహర్ రమేష్ దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కించడం చకచకా జరిగిపోయాయి. త

Written By: Shiva, Updated On : August 8, 2023 4:39 pm

Bhola Shankar

Follow us on

Bhola Shankar: సినీ పరిశ్రమలో ఒక సినిమా పట్టాలెక్కాలంటే సవాలక్ష లెక్కలు ఉంటాయి. ఒక్కోసారి పూజ కార్యక్రమాలు జరిగిన సినిమాలు కూడా ఆగిపోవడం చూస్తాం. అలాగే ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ అని తెలుసు. కానీ అదే సినిమాను పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని భావించి పూజ కార్యక్రమాలు కూడా జరిగిన విషయం పెద్దగా తెలియదు.

అవును మీరు విన్నది నిజమే..! వేదాళం సినిమాను మొదటగా పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని అనుకున్నారు. ఏ.ఎం రత్నం ఈ చిత్ర స‌మ‌ర్ప‌కుడుగా, జిల్లా చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆర్‌.టి.నేస‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.ఐశ్వ‌ర్య ఈ సినిమాను నిర్మించటానికి సిద్దమై 2016 అక్టోబర్ లో ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ ను మిత్రుడైన నిర్మాత శ‌ర‌త్ మ‌రార్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్కొన్నాడు.

కానీ ఏమి జరిగిందో ఏమో ఈ సినిమా పట్టాలెక్కలేదు. కానీ ఆ తర్వాత మరో రీమేక్ చిత్రం కాటమరాయుడు తో పవన్ కళ్యాణ్ మన ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. బహుశా కాటమరాయుడు ఎఫెక్ట్ వలన ఈ సినిమాను పక్కన పెట్టేశారేమో. ! వేదాళం రీమేక్ కు సినిమా కు సమర్పకుడిగా వ్యవహరించిన రత్నం కు పవన్ కళ్యాణ్ మరో అవకాశం ఇచ్చారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా రత్నం నిర్మిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ చేద్దామనుకున్న వేదాళం రీమేక్ అటు ఇటు తిరిగి చివరికి మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు రావడం, మెహర్ రమేష్ దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కించడం చకచకా జరిగిపోయాయి. తమ్ముడు చేద్దామనుకున్న సినిమా అన్నయ్య పూర్తి చేయడం విశేషం. అప్పుడెప్పుడో విడుదలైన వేదాళం సినిమా ఇంతవరకు OTT లో లేకపోవడం విశేషం. బహుశా రీమేక్ రైట్స్ ఉండటం వలన అది కుదరలేదేమో. అప్పట్లో OTT లకు ఇంత డిమాండ్ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు రిలీజ్ చేద్దామంటే రైట్స్ ఇష్యూ కావచ్చు. కొంచెం ఆలస్యమైనా కానీ వేదాళం సినిమా తెలుగులో రీమేక్ అయ్యి విడుదల కావడం విశేషం