Kalki 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదలైన కల్కి ప్రభంజనం ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో భారీగా విస్తరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరికొద్ది గంటల్లో థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా టికెట్లను బుక్ చేసుకోవడంలో కూడా అభిమానులు చాలా ఉత్సాహాన్ని చూపించారు.
దాంతోపాటుగా ఈ సినిమాను సూపర్ సక్సెస్ చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క అభిమాని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ప్రభాస్ ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రెండు స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయట. అందులో ఒకటి మలయాళం స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
Also Read: Shankar Bharateeyudu 2: శంకర్ భారతీయుడు 2 కోసం అనిరుధ్ ను తీసుకొని తప్పు చేశాడా..?
అయితే ఆయన పాత్ర ఏంటి అనేది తెలియడం లేదు కానీ ఆయన పాత్రని ఒకేసారి థియేటర్లో రిలీజ్ చేయడానికి ఎవ్వరికీ తెలియకుండా ఆ పాత్రను దాచి ఉంచుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే దుల్కర్ సల్మాన్ గతంలో ‘సీతారామం ‘ సినిమాతో తెలుగు లో మంచి సక్సెస్ ని అందుకొని ఇక్కడ కూడా మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. కాబట్టి దుల్కర్ సల్మాన్ ఒక పది నిమిషాల క్యామియో రోల్ పోషించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈయనతో పాటుగా తెలుగు స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
Also Read: Kalki 2898 AD USA Review: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ మూవీ యూఎస్ఏ రివ్యూ…
ఇక ఇప్పటికే నాగ్ అశ్విన్ తీసిన రెండు సినిమాల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు రీసెంట్ గా కల్కి సినిమాలో కూడా ఒక భాగం అయ్యాడని సినిమా యూనిట్ నుంచి ఒక లీకేజ్ అయితే వస్తుంది. ఇక మరికొద్ది గంటల్లో రాబోతున్న ఈ సినిమా మీద ఉన్న అనుమానాలన్నీ క్లియర్ కావాలంటే మొదటి షో పడితే గాని ప్రతి ఒక్కరికి ఈ సినిమా మీద క్లారిటీ అయితే రాదు…