Chiranjeevi Birthday: స్వయంకృషి తో పునాది రాళ్లు వేసుకొని ఆపద్భాందవుడిగా మారిన విజేత మెగాస్టార్ చిరంజీవి…

చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం 'వాళ్ళ శకాన్ని కాలం తలపై సంతకంలా మారుస్తూ తర్వాత జనరేషన్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తు ఉంటారు'. అందులో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు...

Written By: Gopi, Updated On : August 22, 2024 9:09 am

Chiranjeevi Birthday

Follow us on

Chiranjeevi Birthday: ఒక సినిమా చేయడం అనేది చాలా మంది కల.. సినిమాని చూసేంతవరకు థియేటర్ కి వెళ్లి టికట్టు కొనుక్కొని సినిమా చూస్తే సరిపోతుంది. కానీ ఆ తెరమీద మనల్ని మనం చూసుకోవాలంటే మాత్రం అది చాలా వ్యయ, ప్రయాసలతో కూడుకున్న పని అని సగటు ప్రేక్షకుడు తనకు ఉన్న కలని కూడా చంపుకొని బతుకుతున్న రోజులవి…కానీ ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి విపరీతమైన కష్టాలను ఎదుర్కొని కష్టమైన, సుఖమైన ఇక్కడే ఉంటా అయితే హీరో అవుతా, లేకపోతే చచ్చిపోతా అంతే తప్ప ఇంటికి తిరిగి వెళ్లను అనే ఒక మొండి ధైర్యంతో ముందడుగు వేసిన ఒకే ఒక్కడు మెగాస్టార్ చిరంజీవి… ‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ అనే ఒక నినాదాన్ని నమ్ముతూ, రగులుతున్న గుండెల్లో నుంచి అగ్నిజ్వాలను పుట్టించగలిగే ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు సాగిన ఒకే ఒక్కడు చిరంజీవి. ముళ్ల దారిలో నడుచుకుంటూ ఆయన చేసిన పోరాటం ఇప్పుడు అతనికి పూలబాటను పరిచింది. ఎప్పుడైనా మనకు కావలసింది ఈజీగా వస్తే అందులో కిక్ ఉండదు. మనం శోధించి సాధిస్తేనే అది మనకు చాలా ఉన్నతంగా, ఉత్తమంగా కనిపిస్తుందని చెప్పడానికి మెగాస్టార్ చిరంజీవిని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో విజయాలను అందుకున్నాడు.

Also Read: రానా – సమంత కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా పేరు చెప్పగలరా? పాపులర్ సూపర్ హిట్ కి రీమేక్!

ఇక సినిమా చూసే అభిమానుల ధోరణిని సైతం మార్చి వేస్తూ తన స్టైల్ ని ప్రేక్షకుడికి పరిచయం చేస్తూ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. ఇక హీరో అంటే ఎలా ఉండాలో ఒక కొత్త అర్ధాన్ని చెప్పిన నటుడు కూడా తనే కావడం విశేషం… తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించారు. పునాది రాళ్లు, పున్నమినాగు, ప్రాణం ఖరీదు, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో ఉత్తమమైన పాత్రలను పోషించి చిరంజీవిని మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఖైదీ, గ్యాంగ్ లీడర్ , జగదేకవీరుడు అతిలోకసుందరి, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ఘరానా మొగుడు, రౌడి అల్లుడు, ఇంద్ర, ఠాగూర్ లాంటి ఎన్నో కమర్షియల్ హిట్ల ను సొంతం చేసుకొని 40 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న ఒకే ఒక్కడు చిరంజీవి… ఆయన వేసిన బాట ఆ తరువాత జనరేషన్ కి పూలబాటలా మారింది.

ఇండస్ట్రీ లోకి ఎంత మంది హీరోలు వచ్చిన నీలాంటి ఘనతను సాదించడం అసాధ్యమనే చెప్పాలి… ఇక ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన మెగాస్టార్ ఇంకా చాలా సంవత్సరాల పాటు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో తను కూడా కృషి చేయాలని కోరుకుందాం…

Also Read: మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా చేయడానికి కారణం ఏంటంటే..?