https://oktelugu.com/

Pawan Kalyan And Balakrishna: పవన్ కళ్యాణ్, బాలయ్య కాంబో లో మిస్ అయిన భారీ మల్టీ స్టారర్ ఫిల్మ్…కారణం ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు మల్టీ స్టార్స్ సినిమాల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. కానీ ఇంతకు ముందే మన స్టార్ హీరోలు చాలా సార్లు మల్టీ స్టారర్ సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ అవి అనుకొని కారణాల వల్ల తెర మీదకు రాలేకపోయాయి...

Written By:
  • Gopi
  • , Updated On : August 22, 2024 / 09:00 AM IST

    Pawan Kalyan And Balakrishna

    Follow us on

    Pawan Kalyan And Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన సినిమాలు ఆయనను ఉత్తమమైన పొజిషన్ లో నిలపడమే కాకుండా నందమూరి అభిమానులందరిలో బాలయ్య బాబు చెరగని ముద్ర వేసుకున్నాడనే చెప్పాలి. అలాంటి బాలయ్య ఈరోజు ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఇదిలా ఉంటే మెగా స్టార్ తమ్ముడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మొదట్లో ఈయన చేసిన ఏడు సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. దాంతో పవర్ స్టారర్ గా ఎదిగాడు. ఇక బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ ల సినిమాలు అయితే ఫ్లాప్ అవుతాయి. లేకపోతే ఇండస్ట్రీ హిట్లుగా మిగులుతాయి. అంతే తప్ప యావరేజ్ లు అనేవి ఈ ఇద్దరి హీరోల కెరియర్ లో చాలా తక్కువనే చెప్పాలి. ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరూ స్టార్ హీరోలుగా ముందుకు దూసుకెళ్లడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలకి ఒక మంచి విషయం అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే వీళ్లిద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ అశ్విని దత్ చాలా వరకు ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమా కి టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాలని ప్రయత్నం చేశాడు. కానీ ఈ సినిమా కార్య రూపం దాల్చలేదు.

    Also Read: మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా చేయడానికి కారణం ఏంటంటే..?

    దీనికి కారణం ఏదైనా కూడా నందమూరి, మెగా ఫ్యామిలీల కాంబినేషన్ లో ఒక మంచి సినిమా మిస్సయిందనే చెప్పాలి. ఇక ఈ వెలితిని ఎన్టీఆర్, రామ్ చరణ్ ‘త్రిబుల్ ఆర్’ రూపంలో తీర్చినప్పటికీ బాలయ్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా పడుంటే మాత్రం అది పక్కగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచేదని చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికి బాలయ్య పవన్ కళ్యాణ్ లకు ఉన్న ప్రత్యేకతలు వేరే లేవల అనే చెప్పాలి…

    ప్రస్తుతం వీళ్ళిద్దరూ రాజకీయంగా చాలా వరకు రాణిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తుంటే, బాలయ్య మాత్రం హిందూపురం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య బాబి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

    ఈ సినిమాతో ఇండస్ట్రీలో మరోసారి తన పేరు మారుమ్రోగిపోయేలా చేయాలని చూస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను సెట్స్ మీద ఉంచినప్పటికీ ఆ సినిమాలను పూర్తి చేయడానికి తొందర్లోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…చూడాలి మరి ఈ హీరోలు ఫ్యూచర్ లో ఇంకా ఎన్ని రికార్డ్ లను క్రియేట్ చేస్తారు అనేది…

    Also Read: రానా – సమంత కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా పేరు చెప్పగలరా? పాపులర్ సూపర్ హిట్ కి రీమేక్!