సంగీత సామ్రాజ్యంలో పాటల రారాజుగా కొనసాగుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల కరోనా బారిన పడ్డారు. దీంతో కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఈ సమయంలోనే ఆయన ఆరోగ్యంపై విషమించడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించాల్సి వచ్చింది. వైద్యుల కృషి ఫలితంగా తాజాగా బాలు కరోనాను జయించారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తన ఇన్ స్ట్రా గ్రాంలో ఓ వీడియో పోస్టు చేశాడు.
Also Read : ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత
ఈ వీడియోలో ఆయన ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య వివరాలను వెల్లడించారు. ‘నాన్న ఆరోగ్యం గురించి కొద్దిరోజులుగా అప్డేట్ ఇవ్వలేకపోయాయని.. క్షమించండి.. గతంతో పొలిస్తే, నాన్న ఊపిరితిత్తుల పనితీరు మెరుగవడంతో వెంటిలేటర్ తొలగిస్తారని భావించాం.. అయితే ఇంకా ఇన్ ఫెక్షన్ ఉండటంతో తీయలేదు.. అయితే శుభవార్త ఏంటంటే ఆయనకు కరోనా పరీక్షల్లో తాజాగా నెగిటివ్ వచ్చిందని’ తెలిపారు.
ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆయన ఊపిరితిత్తుల సమస్య నుంచి కోలుకుంటారనే ఆశాభావాన్ని చరణ్ వ్యక్తం చేశాడు. ఇక వారాంతంలో అమ్మనాన్న వార్షికోత్సవం ఉండటంతో చిన్న సెలబ్రేషన్స్ చేసినట్లు చెప్పాడు. తన తండ్రి ప్రస్తుతం తన ఐపాడ్ లో క్రికెట్, టెన్నిస్ చూస్తున్నారని తెలిపారు. తన తండ్రికి ఫిజియోథెరపీ కొనసాగుతుందని తెలిపారు.
ఇక గత కొద్దిరోజులు ఆయన ఆరోగ్యం నుంచి కోలుకోవాలని దేవుడికి ప్రార్థనలు చేస్తున్న వారిందరికీ ఈ సందర్భంగా చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రార్థనలతో ఆయన మరింత త్వరగా కోలుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఆగస్టు 5న చైన్నె ఎంజీఎంలో బాలసుబ్రమ్మణ్యం చేరినప్పటి నుంచి అభిమానులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. తాజాగా ఆయన కరోనా నెగిటివ్ రావడంతో ఆయన అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : రియా వెనుక బాలీవుడ్ హీరోలు?