https://oktelugu.com/

హీరోగారితో ‘గుత్తా జ్వాల’  నిశ్చితార్థం !

మొత్తానికి బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల మళ్ళీ పెళ్లికి రెడీ అయింది. తన కామెంట్లతో తన బిహేవియర్ తో  సోషల్ మీడియాలో ఎప్పుడూ  హాట్ టాపిక్ అవుతూ ఉండే జ్వాల,  గత కొంత కాలంగా  తమిళ యాక్టర్  విష్ణు విశాల్‌ తో డేటింగ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే  సోషల్ మీడియాలో  ఫుల్ పాపులారిటీ కూడా సంపాదించేసింది జ్వాల.  ఆ మధ్య  విష్ణు విశాల్‌తో తన రహస్య సంబంధాన్ని బహిరంగానే ధృవీకరించిన జ్వాల.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 7, 2020 / 06:00 PM IST
    Follow us on

    మొత్తానికి బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల మళ్ళీ పెళ్లికి రెడీ అయింది. తన కామెంట్లతో తన బిహేవియర్ తో  సోషల్ మీడియాలో ఎప్పుడూ  హాట్ టాపిక్ అవుతూ ఉండే జ్వాల,  గత కొంత కాలంగా  తమిళ యాక్టర్  విష్ణు విశాల్‌ తో డేటింగ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే  సోషల్ మీడియాలో  ఫుల్ పాపులారిటీ కూడా సంపాదించేసింది జ్వాల.  ఆ మధ్య  విష్ణు విశాల్‌తో తన రహస్య సంబంధాన్ని బహిరంగానే ధృవీకరించిన జ్వాల..  వివాహం మాత్రం ఇప్పట్లో చేసుకునే ఆలోచన లేదని.. అయితే ప్రేమలో మాత్రం  మేము చాల లోతులో ఉన్నామని, అలాగే మాది గౌరవంతో కూడుకున్న ప్రేమ అని ఇలా తన ప్రేమ గురించి ఓ థీరినే చెప్పింది.
     
    అయితే నేడు జ్వాల పుట్టినరోజు.  తన పుట్టినరోజు వేడుక సందర్భంగా గుత్తా జ్వాల – విష్ణు విశాల్‌ జంట నిశ్చితార్థం చేసుకుంది.  ఇంకా పెళ్లి తేదీని ఇంకా ప్రకటించలేదు.  కొత్త సంవత్సర  వేడుకల్లో గుత్తా జ్వాల – విష్ణు విశాల్‌ జంట కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఫోటోలు బయటకు రావడంతో,  మొదటిసారి వీరి గురించి అందరికీ తెలిసింది. ఆ తరువాత  విశాల్ విష్ణు తనను ముద్దాడుతున్న ఫోటోను జ్వాలనే  స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ మధ్య ఉన్న బంధాన్ని ప్రపంచానికి సగర్వంగా చాటింది జ్వాల. ఎంతైనా జ్వాల ఇలాంటి విషయాల్లో అసలు మొహమాటపడదు.
     
     కానీ, గుత్తా జ్వాల, విష్ణు విశాల్‌ తో ఎఫైర్‌ పై  నెటిజ‌న్లు మాత్రం  రకరకాల నెగిటివ్ కామెంట్స్ చేశారు. విష్ణు విశాల్‌ తన భార్య రజనీతో విడిపోవడానికి కారణం గుత్తా జ్వాలనేనని  విమర్శిస్తున్నారు. కానీ జ్వాల ఇలాంటి విమర్శలను పెద్దగా పట్టించుకోదు అనుకోండి. జ్వాల గతంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  కానీ ఆ బంధం కొద్దికాలానికి పరిమితం అయింది. ఇప్పుడు హీరో విష్ణు విశాల్‌ తో  మళ్ళీ పెళ్లికి రెడీ అయింది.