https://oktelugu.com/

Karthika Deepam: దీప కోసం హోటల్ కు వెళ్ళిన సౌందర్య, ఆనందరావు.. కన్నీటితో మునిగిపోయిన వంటలక్క!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. సౌందర్య, ఆనందరావు కార్తీక్ పనిచేసే హోటల్ కి వచ్చి కాఫీ ఆర్డర్ చేస్తారు. ఇక వారి దగ్గరికి వెళ్లిన అప్పారావు వారితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కార్తీక్ కాఫీ తీసుకొని వస్తూ ఉండగా తన తల్లిదండ్రులను చూసి దాచుకుంటాడు. దూరం నుండి వాళ్ళను చూస్తూ ఉంటాడు. అప్పు వచ్చి కార్తీక్ దగ్గర కాఫీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తాడు. ఇక […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 22, 2022 / 09:44 AM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. సౌందర్య, ఆనందరావు కార్తీక్ పనిచేసే హోటల్ కి వచ్చి కాఫీ ఆర్డర్ చేస్తారు. ఇక వారి దగ్గరికి వెళ్లిన అప్పారావు వారితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కార్తీక్ కాఫీ తీసుకొని వస్తూ ఉండగా తన తల్లిదండ్రులను చూసి దాచుకుంటాడు. దూరం నుండి వాళ్ళను చూస్తూ ఉంటాడు. అప్పు వచ్చి కార్తీక్ దగ్గర కాఫీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తాడు.

    Karthika Deepam

    ఇక అప్పు మోనిత గురించి మాట్లాడుతూ మోనితతో దిగిన సెల్ఫీని వాళ్లకు చూపించటంతో సౌందర్య షాక్ అవుతుంది. వెంటనే ఆనందరావును అక్కడి నుంచి తీసుకొని వెళుతుంది. ఇక మహాలక్ష్మి దీపకు బాబును ఇస్తుంది. హోటల్లో కార్తీక్ తన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉండటంతో కాస్త బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్లాలని అనుకుంటాడు.

    Also Read: అప్పుపై కోపంతో రగిలిపోయిన వంటలక్క.. ఏకంగా డాక్టర్ బాబు ఆ మాట అనడంతో!

    సౌందర్య, ఆనందరావు ఆశ్రమంకు వెళుతూ కాఫీ బాగుందని దీప చేసిన కాఫీలా ఉంది అనటం తో అక్కడ దీప ఉందేమో అని తిరిగి హోటల్ కు వెళ్తారు. యజమానిని దీప గురించి అడగటంతో అతడు వేరే వాళ్ళు చేశారని చెబుతాడు. ఇక సౌందర్య, ఆనందరావు అక్కడినుంచి బాధతో వెళ్ళిపోతారు. రుద్రాణి బాబుని తీసుకెళ్లడంతో దీప అక్కడికి వెళ్లి బాబుని ఇవ్వమని గట్టిగా అడుగుతుంది.

    ఇక రుద్రాణి అప్పు కట్టకపోయినా వడ్డీ కట్టి బాబును తీసుకెళ్ళమని అనటంతో దీప ఇంటికి వచ్చి బాబుని తీసుకెళ్లినందుకు బాగా ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్ తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని ఆశ్రమంలో కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. కానీ అతడు అలా అడగటం కరెక్ట్ కాదని అంటారు. తరువాయి భాగం లో దీప వడ్డీకి డబ్బులు సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక కార్తీక్ తమ హోటల్ యజమాని దగ్గరికి వెళ్లి అప్పు అడుగుతాడు. ఆయన వంట మనిషికి ఇచ్చాను అనటంతో కార్తీక్ తిరిగి తన ఇంటికి వస్తున్నట్లు కనిపిస్తుంటాడు.

    Also Read: థర్టీ ప్లస్ లో విడాకులు… సమంత-చైతూలలో మొదట శుభవార్త చెప్పేదెవరు?