https://oktelugu.com/

Bimbisara: ఫిబ్రవరి 4న ‘బింబిసార’ వచ్చేస్తున్నాడు !

Bimbisara: మల్లిడి వేణు అలియాస్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ‘బింబిసార’ అంటూ హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా ఓ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటిస్తూ.. పైగా ఆ చిత్రాన్ని తానే నిర్మిస్తున్నాడు. కాగా బింబిసార చిత్రం విడుదల తేదీ దాదాపుగా ఖరారయ్యింది. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో కల్యాణ్ బింబిసార అనే క్రూరమైన రాజుగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 22, 2022 / 10:04 AM IST
    Follow us on

    Bimbisara: మల్లిడి వేణు అలియాస్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ‘బింబిసార’ అంటూ హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా ఓ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటిస్తూ.. పైగా ఆ చిత్రాన్ని తానే నిర్మిస్తున్నాడు. కాగా బింబిసార చిత్రం విడుదల తేదీ దాదాపుగా ఖరారయ్యింది. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో కల్యాణ్ బింబిసార అనే క్రూరమైన రాజుగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా దీన్ని తీసుకొస్తున్నారు.

    Bimbisara

    కళ్యాణ్ రామ్ ను పెట్టి ‘పాన్ ఇండియా సినిమా’ ఎవరు నిర్మించరు కదా. కాబట్టి.. కళ్యాణ్ రామే ఈ సినిమా నిర్మాణం చేపట్టవలసి వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో కళ్యాణ్ రామ్ రిస్క్ చేసి మరి 50 కోట్లు బడ్జెట్ పెడుతున్నాడు. ఈ లెక్కన ఈ సినిమా కళ్యాణ్ రామ్ మార్కెట్ కి కాదు. అయినా కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ పెట్టాడు. పైగా అశోకుడి తాత కాలం నాటి కథతో తయారవుతున్న సినిమా ఇది.

    Also Read: దీప కోసం హోటల్ కు వెళ్ళిన సౌందర్య, ఆనందరావు.. కన్నీటితో మునిగిపోయిన వంటలక్క!

    Bimbisara

    కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఇది చాలా పెద్ద సినిమా. అందుకే, రెండు భాగాలు చేస్తే బెటర్ అనే ఆలోచనలు చేశారు. తాజాగా అందుకు తగ్గట్టు సినిమాలో ఎడిటింగ్ మార్పులు చేశారు. అయితే, మార్పులు చేశాక, సినిమా చూస్తే బాగా ల్యాగ్ అయిపోయింది. దాంతో ఇప్పుడు ఏ సీన్ తీసేయాలి అనే దాని పై క్లారిటీ లేదని.. అందుకే ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు. మరి చివరకు ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

    Also Read: వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..?అసలేం జరుగుతోంది..?

    Tags