Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. గత కొద్ది రోజుల నుంచి జైల్లో ఉన్న మోనిత కార్తీక్ కు మనశ్శాంతి లేకుండా చేయడంతో కార్తీక్ బాధపడటం చూసిన సౌందర్య రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే జైల్లో ఉన్న మోనితను కలిసిన సౌందర్య తనతో వాదోపవాదనలు దిగుతుంది. ఈ క్రమంలోనే నువ్వు ఒక్క పేపర్ కు మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చావ్.. నేను మాత్రం అన్ని పేపర్లు టీవీలలో నీ గురించి కృత్రిమ గర్భం గురించి సాక్షాలతో సహా బయటపెడతాను. నేను దీపా కార్తీక్ ల మాదిరి భయపడను. నువ్వు గులకరాళ్ళతో కొడితే నేను గుమ్మడికాయతో కొడతా అంటూ సౌందర్య మోనితకి గట్టి వార్నింగ్ ఇస్తుంది. పాత కేసులన్నీ బయట పెట్టి నీకు శిక్షపడేలా చేస్తాను. కార్తీక దీపాలను అమెరికా పంపిస్తాను అంటూ చెప్పడంతో మోనిత షాక్ అవుతుంది.

ఇలా తన డైలాగులు సౌందర్య చెప్పడంతో ఎంతో షాక్ అయినా మోనిత సౌందర్య మాటలకు బిత్తిరి పోతుంది. ఇక ఇంట్లో దీప కార్తీక్ మాట్లాడుతూ ఉండగా ఆదిత్య వచ్చి మమ్మీ మోనితను కలవడానికి వెళ్ళింది అని చెప్పడంతో కార్తీక్ సీరియస్ అవుతాడు.అక్కడే ఉన్న ఆనందరావు అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అంటూ అరవగా పిల్లలు రావడం చూసి సైలెంట్ అవుతారు. ఆ సమయంలోనే పిల్లలు మనం వచ్చామని ఆపేసారు అని అనడంతో ఆదిత్య పిల్లలు పిల్లల మాదిరి ఉండండి అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.దీప కూడా పిల్లలను తిట్టడంతో పిల్లల్ని ఏమీ అనకండి ఈ సమస్యకు పరిష్కారం నేను ఆలోచిస్తా అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో దీప డాక్టర్ బాబు అని అనగా నువ్వేం భయపడకు నేను చచ్చిపోయే అంత పిరికి వాడిని కాదు అని కార్తిక్ అనడంతో పిల్లలతో సహా అందరు బాధపడతారు.
సౌందర్య మాటలు విన్న మోనిత అమెరికా ప్రయాణాన్ని ఎలా ఆపాలి అంటూ కంగారు పడుతుంది శాంతి ఉండాలంటే యుద్ధం చేయాలి..శాంతి కోసం కార్తీక్ ను మరింత బాధ పెట్టక తప్పదు అంటూ తనలో తాను అనుకుని మరొక ప్లాన్ కి సిద్ధమవుతోంది. ఇక ఇంటికి చేరుకున్న సౌందర్య ఆనందరావు ఎదురుగా నిలబడి నేను ఆ మోనిత కళ్ళల్లో భయం చూశాను.. అని అక్కడ జరిగిన విషయాలన్నీ చెబుతుంది.వెంటనే దీపా కార్తీక్ ఆదిత్య అంటూ అందరిని పిలిచి అన్నయ్య ఫ్యామిలీ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చెయ్యి అని అంటూ ఉండగా సౌర్య కలగజేసుకుని ఏదో చెప్పబోతూ ఉంది.సౌందర్య ఆవేశంతో నేను ఎవరి అభిప్రాయాలు కనుక్కోవడం లేదు ఇది నా నిర్ణయం మీరు అమెరికా వెళ్తున్నారు అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చెయ్యి ఆదిత్య.. స్వప్నక్క భర్తతో కూడా అన్ని విషయాలు మాట్లాడాను అంటూ చెబుతుంది.
ఆనందరావు ఈ విషయంలో కలుగజేసుకుని ఇప్పుడు అమెరికా ప్రయాణం అంటే కాస్త ఇబ్బంది అవుతుంది కొత్తగా నిబంధనలు అన్నీ వచ్చాయి ఒక రెండు నెలల సమయం పడుతుంది అనగా ఇప్పటి నుంచి ప్రారంభిస్తే రెండు నెలలకు వీరు అమెరికా వెళ్ళిపోతారు అంటూ సౌందర్య చెబుతుంది.నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఎవరికీ చెప్పాల్సిన అడగాల్సిన పనిలేదు తొందరగా ఏర్పాట్లను చూడు అంటూ సౌందర్య చెబుతుంది.ఈ మాటలను విన్న సౌర్య అక్కడినుంచి ఆవేశంతో వెళ్లగా దీప అత్తమ్మ ఆగు అంటూ ఉండగా ఇటు పిల్లలకి అటు మోనితకు భయపడి ఏం సాధిద్దామని దీప అంటూ దీప పై కోపం తెచ్చుకుంటుంది.